శామ్సంగ్ భారతదేశంలో తన రెండవ ప్రధాన డివైజ్ అయిన గాలక్సీ నోట్ 9 ని విడుదల చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆగష్టు 10 న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ఆగస్టు 24 నుండి విక్రయాలకు వెళ్ళబోతోంది. దీని ప్రీ – బుకింగ్ లు ఇప్పటికే ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ రోజు మనం స్మార్ట్ ఫోన్ గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాము ఈసారి, గెలాక్సీ నోట్ 9 యొక్క విభిన్నమైన అంశం దాని S- పెన్ ఇది బ్లూటూత్ మద్దతుతో ఉంటుంది. స్మార్ట్ ఫోన్ కూడా దాని ముందువున్న వాటి కంటే ఎక్కువ మరియు మరింత పెద్ద బ్యాటరీ ని కలిగివుంది.
శామ్సంగ్ గెలాక్సీ నోట్ 9 లాంచ్ ఈవెంట్: లైవ్ స్ట్రీమ్ ని ఎలా చూడాలి
శామ్సంగ్ తెలిపిన ప్రకారం, ఈ రోజు మధ్యాహం 12:30 నుండి కంపెనీ న్యూస్ రూమ్ నుండి ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. కంపెనీ ప్రెసిడెంట్ మరియు ఐటి & మొబైల్ కమ్యూనికేషన్స్ డివిజన్ యొక్క సీఈఓ అయిన, డి.జె. కోహ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
శామ్సంగ్ గెలాక్సీ నోట్ 9 ధర
ముందు పేర్కొన్న విధంగా, స్మార్ట్ ఫోన్ తయారీదారు ఇప్పటికే గెలాక్సీ నోట్ 9 కి సంభందించి ముందు బుకింగ్లను ప్రారంభించారు. ఈ స్మార్ట్ ఫోన్ 128జీబీ మరియు 512జీబీ స్టోరేజి వేరియెంట్లలో లభిస్తుంది, ఇవి వరుసగా రూ . 67,900 మరియు రూ. 84,900 ధరగా ఉంటాయి. ఇంకా ఇది మూడు రంగులలో వస్తుంది: మిడ్నైట్ బ్లాక్, ఓషన్ బ్లూ మరియు మెటాలిక్ కాపర్ రంగులలో వస్తుంది. అయితే, మెటాలిక్ కాపర్ రంగు వేరియంట్ 128జీబీ స్టోరేజితో మాత్రమే విక్రయించబడతాయి.
శామ్సంగ్ గెలాక్సీ నోట్ 9 తో అందుబాటులోవున్న ఆఫర్స్
గాలక్సీ నోట్ కి ముందుగా బుకింగ్ చేసిన వినియోగదారులకు 4,999 రూపాయలకే శామ్సంగ్ గేర్ స్పోర్ట్ స్మార్ట్ వాచ్ ని సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం ఇది భారతదేశంలో రూ .22,990 వద్ద రిటైల్ అవుతోంది. సంస్థ యొక్క అధికారిక వెబ్ సైట్ నుండి దీనిని ముందుగా బుక్ చేసుకోవచ్చు. అదనంగా, కొనుగోలుదారుడు పేటిఎమ్ మాల్ ద్వారా కొనుగోలు చేసినట్లయితే రూ .6,000 ల క్యాష్ బ్యాక్ ని పొందవచ్చు. హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల వినియోగదారులు ఈ పరికరాన్ని కొనుగోలు చేయడానికి హెచ్ డి ఎఫ్ సి వినియోగదారుల డ్యూరబుల్ రుణాలను (CD Loans ) ఉపయోగించేవారికి అదే మొత్తం క్యాష్ బ్యాక్ అందుబాటులో ఉంది. "శామ్సంగ్ అప్గ్రేడ్ ప్రోగ్రాం" కూడా ఉంది, దీని ద్వారా ఈ గెలాక్సీ నోట్ కోసం వారి పాత డివైజ్ కి బదులుగా 6,000 రూపాయల యొక్క అప్గ్రేడ్ బోనస్ పొందేందుకు వినియోగదారులకు వీలు కల్పిస్తుంది. అప్గ్రేడ్ బోనస్ మార్పిడి విలువకు జోడించబడిందని గమనించండి.
ఈ శామ్సంగ్ గెలాక్సీ నోట్ 9 కేవలం రూ .7,900 డౌన్ పేమెంట్ తో ఎయిర్టెల్ ఆన్లైన్ స్టోర్ ద్వారా కొనడానికి అందుబాటులో ఉంటుంది. ఇది తక్షణ రుణ సదుపాయం మరియు సరసమైన EMI లతో అందించబడుతుంది. మిగిలిన EMI లు అన్ని కూడా ఫోన్ లో అంతర్గంగా అందించిన 24 నెలలకు రూ. 2,999 పోస్ట్ పైడ్ ప్లాన్ తో చెల్లించే విధంగా ఇవ్వబడుతున్నది. అయితే ఆగస్టు 24 నుంచి ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో వుండనున్న ఈ ఫోన్ ని ఆగస్టు 22 నుంచి భారత్ వినియోగదారులకు పంపిణీ చేయనున్నట్లు ఎయిర్టెల్ తెలిపింది.
శామ్సంగ్ గెలాక్సీ నోట్ 9 స్పెక్స్
శామ్సంగ్ గెలాక్సీ నోట్ 9 లో 6.4 అంగుళాల క్వాడ్ HD+ సూపర్ అమోల్డ్ డిస్ప్లేని కలిగి ఉంది మరియు ఇది 10nm 64-bit క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 845 ఆక్టా – కోర్ ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఫోన్ , 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజి మరియు 8జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజి లతో రెండు రకాలవేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ రెండు ఫేబ్లేట్ వేరియెంట్స్ ఒక 512జీబీ మైక్రో SD కార్డ్ కి మద్దతును ఇస్తాయి. ఇది ఆండ్రాయిడ్ Oreo 8.1 తో నడుస్తుంది మరియు 4000 mAh బ్యాటరీతో మద్దతు ఇస్తుంది, ఇది స్పీడ్ ఛార్జింగ్ మరియు వైర్లెస్ ఛార్జింగ్ కి మద్దతు ఇస్తుంది.
ఆప్టిక్స్ పరంగా చుస్తే, ఈ శామ్సంగ్ గెలాక్సీ నోట్ 9 వెనుక డ్యూయల్ OIS తో కూడిన డ్యూయల్ – కెమెరా తో సెటప్ చేయబడింది. ఈ డ్యూయల్ కెమెరా వేరియబుల్ f 1.5/ f 2.4 ఆపేర్చేర్ గల 12 ఎంపీ వైడ్ యాంగిల్ సెన్సర్ మరియు f 2.4 ఆపేర్చేర్ గల టెలిఫోటో లెన్స్ ని కలిగివుంది. ముందు f /1.7 ఆపేర్చేర్ గల 8 ఎంపీ సెన్సార్ వుంది.
అయితే ఈ సంవత్సరం S -పెన్ ని బ్లూటూత్ తోడ్యూయల్ కెమెరాకి అనుసంధానించారు దీని ద్వారా వినియోగదారులు సెల్ఫీ,గ్రూప్ ఫోటోలు,స్లయిడ్ షోలను ప్రజెంట్ చేయడానికి మరియు మ్యూజిక్ ప్లే మరియు పాస్ చేయడానికి రిమోట్లాగ కూడా వాడుకునే వీలుంది. ఈ శామ్సంగ్ గెలాక్సీ నోట్ 9 ఫాస్ట్ ఛార్జింగ్ మరియు వైర్లెస్ ఛార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది ఇంకా ఇది IP68 రేటింగ్ చేయబడింది కూడా.