Samsung Galaxy M56 5G launching with sleek design triple ai camera
Samsung Galaxy M56 5G: శామ్సంగ్ గెలాక్సీ M సిరీస్ నుంచి మరో కొత్త ఫోన్ లాంచ్ కోసం డేట్ అనౌన్స్ చేసింది. అదే, శామ్సంగ్ గెలాక్సీ M56 5జి స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను వచ్చే వారంలో విడుదల చేస్తుంది. శామ్సంగ్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను అతి సన్నని డిజైన్ మరియు ట్రిపుల్ AI కెమెరాతో తీసుకు వస్తోంది.
శామ్సంగ్ గెలాక్సీ M56 5జి స్మార్ట్ ఫోన్ ను ఏప్రిల్ 17వ తేదీ లాంచ్ చేస్తున్నట్లు శామ్సంగ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ ఆప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం టీజింగ్ మొదలు పెట్టింది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. అందుకే, శామ్సంగ్ గెలాక్సీ M56 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించి టీజింగ్ చేస్తోంది. ఈ టీజర్ పేజి నుండి ఈ శామ్సంగ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలకమైన ఫీచర్స్ కూడా వెల్లడించింది.
శామ్సంగ్ గెలాక్సీ M56 5జి స్మార్ట్ ఫోన్ ను గెలాక్సీ సిరీస్ లో ఎన్నడూ చూడని స్లీక్ డిజైన్ తో తీసుకువస్తున్నట్లు శామ్సంగ్ తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 7.2mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది మరియు కేవలం 180 గ్రాముల బరువుతో చాలా తేలికగా ఉంటుందని శామ్సంగ్ టీజింగ్ చేస్తోంది. అంతేకాదు, ముందుగా వచ్చిన ఫోన్స్ కంటే 30% సన్నగా ఉంటుందని కూడా చెబుతోంది.
ఈ ఫోన్ లో అడ్వాన్డ్ మాన్స్టర్ కెమెరా ఉందట. ఇందులో, వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. ఈ కెమెరా సెటప్ లో 50MP నో షేక్ మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ మరియు 2MP మ్యాక్రో కెమెరాలు ఉంటాయి. అంతేకాదు, ఈ ఫోన్ కెమెరా బంప్ ను కూడా చూడముచ్చటగా అందించింది. గెలాక్సీ ఎం56 5జి స్మార్ట్ ఫోన్ లో ముందు 10-bit HDR వీడియో సపోర్ట్ కలిగిన 12MP ఫ్లాగ్ షిప్ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ ఆబ్జెక్ట్ ఎరేజర్ మరియు ఇమేజ్ క్లిప్పర్ వంటి AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: అండర్ రూ. 30,000 ఈరోజు లభిస్తున్న బెస్ట్ 1.5 Ton Split AC డీల్.!
శామ్సంగ్ గెలాక్సీ M56 5జి స్మార్ట్ ఫోన్ పెద్ద Super AMOLED+ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ గొరిల్లా విక్టస్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది మరియు విజన్ బూస్టర్ ఫీచర్ తో కలిగి ఉంటుంది. ఈ అప్ కమింగ్ శామ్సంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ ఆకట్టుకునే డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ అవ్వడానికి సిద్ధం అవుతోంది. ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్స్ కూడా శామ్సంగ్ వెల్లడించే అవకాశం ఉండవచ్చు.