రేపు విడుదల కానున్న Samsung Galaxy M56 5G కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకోండి.!

Samsung Galaxy M56 5G స్మార్ట్ ఫోన్ రేపు ఇండియన్ మర్కెట్లో లాంచ్ అవుతుంది
లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ ముందే వెల్లడించింది
ఈ ఫోన్ M సిరీస్ లో అత్యంత స్లీక్ డిజైన్ కలిగిన స్మార్ట్ ఫోన్ గా వస్తోంది
Samsung Galaxy M56 5G స్మార్ట్ ఫోన్ రేపు ఇండియన్ మర్కెట్లో లాంచ్ అవుతుంది. అయితే, లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ ముందే వెల్లడించింది. ఈ ఫోన్ M సిరీస్ లో అత్యంత స్లీక్ డిజైన్ కలిగిన స్మార్ట్ ఫోన్ గా వస్తోంది. రేపు విడుదల కాబోతున్న ఈ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ ముందే తెలుసుకోండి.
Samsung Galaxy M56 5G: ఫీచర్స్
శామ్సంగ్ గెలాక్సీ ఎం 56 5జి స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల అవుతుంది. శామ్సంగ్ గెలాక్సీ ఎం 56 5జి స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ గా శామ్సంగ్ తీసుకు వస్తోంది. అంటే, ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా ఉంటుంది.
Samsung Galaxy M56 5G: ఫీచర్స్
శామ్సంగ్ గెలాక్సీ ఎం 56 5జి స్మార్ట్ ఫోన్ డిజైన్ పరంగా గొప్ప డిజైన్ తో కనిపిస్తుంది. ఎందుకంటే, ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 7.2 mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ కేవలం 180 గ్రాములే ఉంటుందట. అంటే, ఈ ఫోన్ చాలా తేలికగా ఉంటుంది. ఈ ఫోన్ చాలా సన్నని అంచులు కలిగిన Super AMOLED+ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ విజన్ బూస్టర్ తో ఉంటుంది మరియు అధిక బ్రైట్నెస్ ను కూడా కలిగి ఉంటుంది.
శామ్సంగ్ గెలాక్సీ ఎం 56 5జి స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ట్రిపుల్ కెమెరాలో 50MP నో షేక్ మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ మరియు 2MP మాక్రో సెన్సార్ లు కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ ముందు భాగంలో 12MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ మంచి క్వాలిటీ ఫోటోలు మరియు 10-bit HDR వీడియోలు అందిస్తుందని శామ్సంగ్ తెలిపింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ AI కెమెరా ఫీచర్స్ మరియు AI ఎడిటింగ్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: Panasonic Smart Tv పై బిగ్ డీల్ అందించిన అమెజాన్ ఇండియా.!
ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ ముందు మరియు వెనుక కూడా పటిష్టమైన గొరిల్లా గ్లాస్ విక్టస్+ రక్షణతో ఉంటుంది. అంటే, ఈ ఫోన్ చాలా గట్టి గ్లాస్ బ్యాక్ డిజైన్ కలిగి ఉంటుంది మరియు ఈ ఫోన్ స్క్రీన్ కూడా చాలా పటిష్టమైన గ్లాస్ తో ఉంటుంది. ఈ ఫోన్ రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది.