Samsung Galaxy M55s: సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ అవుతున్న శామ్సంగ్ ఫోన్.!

Updated on 19-Sep-2024
HIGHLIGHTS

Samsung Galaxy M55s లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది శామ్సంగ్

ఈ ఫోన్ డిజైన్ మరియు కీలకమైన ఫీచర్స్ ను కూడా అనౌన్స్ చేసింది

శామ్సంగ్ ఫోన్ లలో ఇప్పటివరకు చూడని సరికొత్త డిజైన్ తో ఈ ఫోన్ కనిపిస్తోంది

Samsung Galaxy M55s స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది శామ్సంగ్. ఈ అప్ కమింగ్ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ డిజైన్ మరియు కీలకమైన ఫీచర్స్ ను కూడా అనౌన్స్ చేసింది. శామ్సంగ్ ఫోన్ లలో ఇప్పటివరకు చూడని సరికొత్త డిజైన్ తో ఈ ఫోన్ కనిపిస్తోంది. ఈ శామ్సంగ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ అప్డేట్ పై ఒక లుక్కేద్దామా.

Samsung Galaxy M55s: లాంచ్

శామ్సంగ్ గెలాక్సీ ఎం 55s స్మార్ట్ ఫోన్ ను సెప్టెంబర్ 23 అవా తేదీ లాంచ్ చేస్తునట్లు శామ్సంగ్ ప్రకటించింది. ఈ ఫోన్ ను సరికొత్త డిజైన్ తో అమెజాన్ స్పెషల్ గా తీసుకు వస్తోంది. అందుకే, అమెజాన్ ఇండియా ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించి మరీ టీజింగ్ చేస్తోంది.

Samsung Galaxy M55s: ఫీచర్స్

శామ్సంగ్ గెలాక్సీ ఎం 55s స్మార్ట్ ఫోన్ సరికొత్త ఫ్యూజన్ డిజైన్ తో వస్తుంది. ఈ ఫోన్ చాలా సన్నగా మరియు బ్యాక్ ప్యానల్ లో ఆకర్షణీయమైన డబుల్ డిజైన్ ప్యాట్రన్ ను కలిగి వుంది. వాస్తవానికి, ఇప్పటి వరకు శామ్సంగ్ కేవలం రెగ్యులర్ సింగిల్ కలర్ తో మాత్రమే తన ఫోన్ లను అందించింది. అయితే, ఇప్పుడు ఈ కొత్త ఫోన్ ను మాత్రం సరికొత్త డిజైన్ తో అందిస్తోంది.

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 50MP OIS మెయిన్ + 8MP అల్ట్రా వైడ్ + 2MP మ్యాక్రో సెన్సార్లు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇది No Shake వీడియోలు మరియు బ్లర్ ఫ్రీ ఫోటోలు అందిస్తుందని శామ్సంగ్ తెలిపింది. ఈ ఫోన్ లో 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ సెల్ఫీ కెమెరాతో గ్రూప్ ఫోటోలు మరియు వీడియో రికార్డింగ్ తో పాటు క్వాలిటీ వీడియో కాలింగ్ సౌకర్యం అందుతుందని కూడా శామ్సంగ్ తెలిపింది.

Also Read: Honor 200 Lite 5G ఫోన్ ను సూపర్ కెమెరా సిస్టం తో బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది.!

ఈ ఫోన్ లో 6.67 ఇంచ్ సూపర్ AMOLED స్క్రీన్ ఉంటుందని కూడా శామ్సంగ్ తెలిపింది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్ తో వస్తుంది మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ అప్ కమింగ్ ఫోన్ థండర్ బ్లాక్ మరియు కోరల్ గ్రీన్ రెండు కలర్ ఆప్షన్ లలో లాంచ్ అవుతుంది. లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్స్ గురించి కూడా శామ్సంగ్ వివరాలు వెల్లడించే అవకాశం వుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :