Samsung Galaxy M55 5G స్మార్ట్ ఫోన్ నిన్న బ్రెజిల్ మార్కెట్ లో విడుదల చెయ్యబడింది. బ్రెజిల్ లో విడుదల చేస్తే మాకెందుకు చెబుతున్నావు అనుకుంటున్నారా?, ఈ ఫోన్ ఇండియాలో కూడా విడుదల కాబోతోంది. సాంసంగ్ ఈ ఫోన్ ను ఇండియాలో విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేసింది. అందుకే, నేను మార్కెట్లో ఈ ఫోన్ గురించి తెలుసుకోవాలనే కుతూహలం కూడా పెరిగిపోయింది. సాంసంగ్ ఈ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon లేటెస్ట్ చిప్ సెట్ మరియు 50MP సెల్ఫీ కెమేరాలతో పాటుగా మరిన్ని ఫీచర్స్ తో ఈ ఫోన్ ను విడుదల చేసింది.
సాంసంగ్ గెలాక్సీ M55 5జి స్మార్ట్ ఫోన్ ను BRL 2,879.10 (సుమారు రూ. 47,842) ధరతో బ్రెజిల్ మార్కెట్ లో విడుదల చేసింది. అయితే, ఈ ఫోన్ ను ఇన్స్టాల్ మెంట్ (24 Instalments) తో కొనాలంటే మాత్రం BRL 3,199 (సుమారు రూ. 47,842) చెల్లించాలి.
సాంసంగ్ గెలాక్సీ M55 5జి ఫోన్ ను 6.7 ఇంచ్ Super AMOLED స్క్రీన్ తో అందించింది. ఇది FHD+ రిజల్యూషన్ మరియు విజన్ బూస్టర్ ఫీచర్ తో వస్తుంది. అంతేకాదు, ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ ను కూడా కలిగి ఉంటుంది.
ఈ సాంసంగ్ స్మార్ట్ ఫోన్ Snapdragon 7 Gen 1 ఆక్టా కోర్ 5జి ప్రోసెసర్ శక్తితో పని చేస్తుంది. ఇది లేటెస్ట్ UI 6.1 సాఫ్ట్ వేర్ తో Android 14 OS పైన నడుస్తుంది.
సాంసంగ్ ఈ స్మార్ట్ ఫోన్ ను 8GB RAM మరియు 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో అందించింది. ఒక ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ తో ఈ ఫోన్ స్టోరేజ్ ను 1TB వరకూ పెంచుకోవచ్చు.
Also Read: WhatsApp AI image: ఫోటో ఎడిటింగ్ కోసం కొత్త AI ఫీచర్ తెచ్చిన వాట్సప్.!
ఈ సాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ మంచి కెమేరా సెటప్ నే కలిగి వుంది. ఈ ఫోన్ లో వెనుక 50MP మెయిన్ + 8MP అల్ట్రా వైడ్ + 2MP మ్యాక్రో కలిగిన ట్రిపుల్ రియర్ మరియు ముందు 50MP సెల్ఫీ కెమేరా వుంది. ఈ ఫోన్ కెమేరాతో
సాంసంగ్ గెలాక్సీ M55 5జి ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీ వుంది. ఈ బ్యాటరీని చాలా వేగంగా ఛార్జ్ చేయగల 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ని కూడా అందించింది. అయితే, ఈ ఫోన్ తో పాటుగా ఛార్జర్ మాత్రం రాదు.
పైన తెలిపిన వివరాలు బ్రెజిల్ మార్కెట్ లో విడుదల చేయబడిన సాంసంగ్ గెలాక్సీ M55 5జి వివరాలు కాగా, ఇండియన్ మార్కెట్ లో విడుదల కాబోతున్న వేరియంట్ ప్రోసెసర్ ని కన్ఫర్మ్ చేసింది.