Samsung Galaxy M55 5G ఈ టాప్-5 ఫీచర్స్ తో లాంఛ్ అయ్యింది.. రేటు ఎంతంటే.!
Samsung Galaxy M55 5G బ్రెజిల్ మార్కెట్ లో విడుదల చెయ్యబడింది
ఈ ఫోన్ ఇండియాలో కూడా విడుదల కాబోతోంది
Snapdragon లేటెస్ట్ చిప్ సెట్ మరియు 50MP సెల్ఫీ కెమేరాతో వచ్చింది
Samsung Galaxy M55 5G స్మార్ట్ ఫోన్ నిన్న బ్రెజిల్ మార్కెట్ లో విడుదల చెయ్యబడింది. బ్రెజిల్ లో విడుదల చేస్తే మాకెందుకు చెబుతున్నావు అనుకుంటున్నారా?, ఈ ఫోన్ ఇండియాలో కూడా విడుదల కాబోతోంది. సాంసంగ్ ఈ ఫోన్ ను ఇండియాలో విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేసింది. అందుకే, నేను మార్కెట్లో ఈ ఫోన్ గురించి తెలుసుకోవాలనే కుతూహలం కూడా పెరిగిపోయింది. సాంసంగ్ ఈ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon లేటెస్ట్ చిప్ సెట్ మరియు 50MP సెల్ఫీ కెమేరాలతో పాటుగా మరిన్ని ఫీచర్స్ తో ఈ ఫోన్ ను విడుదల చేసింది.
Samsung Galaxy M55 5G Price (Brazil)
సాంసంగ్ గెలాక్సీ M55 5జి స్మార్ట్ ఫోన్ ను BRL 2,879.10 (సుమారు రూ. 47,842) ధరతో బ్రెజిల్ మార్కెట్ లో విడుదల చేసింది. అయితే, ఈ ఫోన్ ను ఇన్స్టాల్ మెంట్ (24 Instalments) తో కొనాలంటే మాత్రం BRL 3,199 (సుమారు రూ. 47,842) చెల్లించాలి.
Samsung Galaxy M55 5G టాప్ – 5 ఫీచర్స్
Display
సాంసంగ్ గెలాక్సీ M55 5జి ఫోన్ ను 6.7 ఇంచ్ Super AMOLED స్క్రీన్ తో అందించింది. ఇది FHD+ రిజల్యూషన్ మరియు విజన్ బూస్టర్ ఫీచర్ తో వస్తుంది. అంతేకాదు, ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ ను కూడా కలిగి ఉంటుంది.
Processor & OS
ఈ సాంసంగ్ స్మార్ట్ ఫోన్ Snapdragon 7 Gen 1 ఆక్టా కోర్ 5జి ప్రోసెసర్ శక్తితో పని చేస్తుంది. ఇది లేటెస్ట్ UI 6.1 సాఫ్ట్ వేర్ తో Android 14 OS పైన నడుస్తుంది.
RAM & Storage
సాంసంగ్ ఈ స్మార్ట్ ఫోన్ ను 8GB RAM మరియు 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో అందించింది. ఒక ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ తో ఈ ఫోన్ స్టోరేజ్ ను 1TB వరకూ పెంచుకోవచ్చు.
Also Read: WhatsApp AI image: ఫోటో ఎడిటింగ్ కోసం కొత్త AI ఫీచర్ తెచ్చిన వాట్సప్.!
Camera
ఈ సాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ మంచి కెమేరా సెటప్ నే కలిగి వుంది. ఈ ఫోన్ లో వెనుక 50MP మెయిన్ + 8MP అల్ట్రా వైడ్ + 2MP మ్యాక్రో కలిగిన ట్రిపుల్ రియర్ మరియు ముందు 50MP సెల్ఫీ కెమేరా వుంది. ఈ ఫోన్ కెమేరాతో
Battery & Charge Tech
సాంసంగ్ గెలాక్సీ M55 5జి ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీ వుంది. ఈ బ్యాటరీని చాలా వేగంగా ఛార్జ్ చేయగల 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ని కూడా అందించింది. అయితే, ఈ ఫోన్ తో పాటుగా ఛార్జర్ మాత్రం రాదు.
పైన తెలిపిన వివరాలు బ్రెజిల్ మార్కెట్ లో విడుదల చేయబడిన సాంసంగ్ గెలాక్సీ M55 5జి వివరాలు కాగా, ఇండియన్ మార్కెట్ లో విడుదల కాబోతున్న వేరియంట్ ప్రోసెసర్ ని కన్ఫర్మ్ చేసింది.