Samsung Galaxy M35: శామ్సంగ్ ప్రకటించిన శామ్సంగ్ గెలాక్సీ ఎం 35 స్మార్ట్ ఫోన్ రేపు ఇండియాలో విడుదల అవుతుంది. ఈ ఫోన్ ను 50MP ట్రిపుల్ కెమెరా మరియు సూపర్ AMOLED వంటి మరిన్ని ఫీచర్ లతో మార్కెట్లో లాంచ్ చేస్తునట్లు శామ్సంగ్ చాలా కాలంగా ఆటపట్టిస్తోంది. రేపు విడుదల కానున్న ఈ స్మార్ట్ ఫోన్ స్పెక్స్ మరియు కీలకమైన ఫీచర్లు ముందే తెలుసుకోండి.
శామ్సంగ్ గెలాక్సీ ఎం 35 5జి స్మార్ట్ ఫోన్ రేపు ఇండియాలో విడుదల చేయబడుతుంది. ఈ ఫోన్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ మొదటి రోజైన జూలై 20 నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Also Read: Noise 4 headphone: బ్లూటూత్ 5.4 మరియు పెద్ద 70 గంటల ప్లేబ్యాక్ తో లాంచ్.!
శామ్సంగ్ ఈ ఫోన్ యొక్క అన్ని కీలకమైన ఫీచర్స్ ను ముందే బయటపెట్టేసింది. గొప్ప కెమెరా సిస్టం తో వచ్చిన గెలాక్సీ M34 5జి ఫోన్ నెక్స్ట్ జనరేషన్ ఫోన్ గా తీసుకు వస్తున్న ఈ ఎం 35 ఫోన్ కూడా గొప్ప కెమెరా సెటప్ ను కలిగి వుంది. ఈ ఫోన్ లో OIS సపోర్ట్ కలిగిన 50MP వైడ్ యాంగిల్ మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 2MP మ్యాక్రో కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా వుంది. అలాగే, ముందు 13MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ మెయిన్ కెమెరాతో గొప్ప ఫోటోలు మరియు నైట్ ఫోటోగ్రఫీ ని కూడా ఆస్వాదించవచ్చు అని కంపెనీ తెలిపింది.
ఈ ఫోన్ గెలాక్సీ సిగ్నేచర్ స్లీక్ డిజైన్ మరియు రౌండ్ కార్నర్ లతో వస్తుంది. ఈ ఫోన్ ను శామ్సంగ్ యొక్క లేటెస్ట్ బడ్జెట్ ప్రోసెసర్ Exynos 1380 తో అందిస్తుంది. ఈ ఫోన్ లో 1000 నిట్స్ బ్రైట్నెస్ కలిగిన ఇన్ఫినిటీ 0 స్క్రీన్ వుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు పటిష్టమైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణ కలిగిన AMOLED డిస్ప్లే. ఈ ఫోన్ ను వేగంగా చల్లబరచడానికి వేపర్ కూలింగ్ ఛాంబర్ కూడా వుంది. ఈ ఫోన్ ను 6000mAh హెవీ బ్యాటరీ మరియు 25 ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందిస్తుంది.
అంతేకాదు, ఈ ఫోన్ 4 జెనరేషన్ OS అప్గ్రేడ్ లను అందుకుంటుందని కూడా శామ్సంగ్ భరోసా ఇస్తోంది.