Samsung Galaxy M35 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియన్ మార్కెట్ లో విడుదలయ్యింది. ఈ ఫోన్ ను 20 వేల ఉప బడ్జెట్ లో గెలాక్సీ సిగ్నేచర్ డిజైన్, 50MP OIS కెమెరా మరియు మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో విడుదల చేసింది. ప్రైమ్ నుండి సేల్ కి అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ పైన ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా శామ్సంగ్ అందించింది.
శామ్సంగ్ గెలాక్సీ ఎం 35 5జి స్మార్ట్ ఫోన్ ను గెలాక్సీ సిగ్నేచర్ డిజైన్ తో తీసుకు వచ్చింది. ఈ ఫోన్ లో 6.6 ఇంచ్ సూపర్ AMOLED స్క్రీన్ వుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్ మరియు కార్నింగ్ గొరిల్లా Glass Victus రక్షణ తో ఉంటుంది. ఈ ఫోన్ Exynos 1380 5జి ప్రోసెసర్ మరియు 8GB ర్యామ్ తో వస్తుంది. ఈ ఫోన్ కేవలం సింగల్ ర్యామ్ తో వస్తుంది. కానీ, 128GB మరియు 256GB రెండు స్టోరేజ్ ఆప్షన్ లు ఉన్నాయి.
శామ్సంగ్ గెలాక్సీ ఎం 35 5జి ఫోన్ లో వెనుక 50 MP + 8 MP + 2 MP ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా OIS సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ కెమెరాతో 30 fps వద్ద 4K UHD వీడియో లను మరియు గొప్ప నైట్ ఫోటోలు పొందవచ్చని కంపెనీ తెలిపింది. అలాగే, ఈ ఫోన్ లో ముందు 13MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ ను 25W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 6000mAh హెవీ బ్యాటరీతో అందించింది. ఈ ఫోన్ 4 ప్రధాన OS అప్గ్రేడ్ లను మరియు 5 సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంటుందని శామ్సంగ్ తెలిపింది.
Also Read: బడ్జెట్ ధరలో హైబ్రిడ్ ANC తో OnePlus Nord Buds 3 Pro బడ్స్ లాంచ్ చేసిన వన్ ప్లస్.!
శామ్సంగ్ గెలాక్సీ ఎం 35 5జి బేసిక్ వేరియంట్ (8GB + 128GB) ను బ్యాంక్ ఆఫర్స్ తో కలిపి రూ. 16,999 రూపాయల ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ తో ICICI మరియు SBI కార్డ్స్ 10% డిస్కౌంట్ ఆఫర్ ను శామ్సంగ్ జత చేసింది. ఈ ఫోన్ జూలై 20 వ తేదీ నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.