Samsung Galaxy M35 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. గత సంవత్సరం సూపర్ కెమెరా బిగ్ బ్యాటరీ తో శామ్సంగ్ తెచ్చిన గెలాక్సీ ఎం 34 నెక్స్ట్ జనరేషన్ ఫోన్ ను తీసుకు వస్తోంది. ఈ ఫోన్ లాంచ్ కోసం డేట్ అనౌన్స్ చేసిన కంపెనీ, ఈ ఫోన్ యొక్క ధర మినహా ఈ ఫోన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ను బయటపెట్టేసింది. మరి ఈ శామ్సంగ్ అప్ కమింగ్ ఫోన్ ఎటువంటి ఫిచర్లతో మార్కెట్ లో అడుగుపెట్టబోతోందో తెలుసుకుందామా.
శామ్సంగ్ గెలాక్సీ ఎం 35 5జి స్మార్ట్ ఫోన్ జూలై 17వ తేదీన లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ కోసం అమెజాన్ సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది మరియు ఈ ఫోన్ ప్రైమ్ డే సేల్ నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Also Read: OnePlus Nord 4: కొత్త లుక్ మరియు డిజైన్ తో వస్తున్న వన్ ప్లస్ ఫోన్.!
శామ్సంగ్ గెలాక్సీ ఎం 35 5జి స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎం 34 మాదిరిగా కంప్లీట్ ప్యాకేజీగా వస్తుంది. ఈ ఫోన్ లో గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ గ్లాస్ ప్రొటెక్షన్ కలిగిన సూపర్ AMOLED డిస్ప్లే వుంది. ఈ డిస్ప్లే 1000 నిట్స్ బ్రైట్నెస్, FHD+ రిజల్యూషన్ మరియు ఇన్ఫినిటీ 0 సెల్ఫీ కెమెరా ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను శామ్సంగ్ యొక్క సొంత లేటెస్ట్ చిప్ సెట్ Exynos 1380 తో లాంచ్ చేస్తోంది. ఈ చిప్ సెట్ AI Engine with 4.9TOPS NPU మరియు Mali- G68 MP5 GPU తో వస్తుంది.
ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఈ సెటప్ లో OIS సపోర్ట్ కలిగిన 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 2MP మ్యాక్రో కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ లో ముందు 13MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. గెలాక్సీ ఎం 35 ఫోన్ లో 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు 25W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ 4 జనరేషన్స్ OS అప్గ్రేడ్ లను అందిస్తుందని కూడా కంపెనీ తెలిపింది.