digit zero1 awards

Samsung Galaxy M35 5G లాంచ్ కంటే ముందే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.!

Samsung Galaxy M35 5G లాంచ్ కంటే ముందే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.!
HIGHLIGHTS

Samsung Galaxy M35 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది

ఈ ఫోన్ యొక్క ధర మినహా ఈ ఫోన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ను బయటపెట్టేసింది

ఈ ఫోన్ లో గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ గ్లాస్ ప్రొటెక్షన్ కలిగిన సూపర్ AMOLED డిస్ప్లే వుంది

Samsung Galaxy M35 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. గత సంవత్సరం సూపర్ కెమెరా బిగ్ బ్యాటరీ తో శామ్సంగ్ తెచ్చిన గెలాక్సీ ఎం 34 నెక్స్ట్ జనరేషన్ ఫోన్ ను తీసుకు వస్తోంది. ఈ ఫోన్ లాంచ్ కోసం డేట్ అనౌన్స్ చేసిన కంపెనీ, ఈ ఫోన్ యొక్క ధర మినహా ఈ ఫోన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ను బయటపెట్టేసింది. మరి ఈ శామ్సంగ్ అప్ కమింగ్ ఫోన్ ఎటువంటి ఫిచర్లతో మార్కెట్ లో అడుగుపెట్టబోతోందో తెలుసుకుందామా.

Samsung Galaxy M35 5G ఎప్పుడు లాంచ్ అవుతుంది?

శామ్సంగ్ గెలాక్సీ ఎం 35 5జి స్మార్ట్ ఫోన్ జూలై 17వ తేదీన లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ కోసం అమెజాన్ సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది మరియు ఈ ఫోన్ ప్రైమ్ డే సేల్ నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Also Read: OnePlus Nord 4: కొత్త లుక్ మరియు డిజైన్ తో వస్తున్న వన్ ప్లస్ ఫోన్.!

Samsung Galaxy M35 5G ఫీచర్లు ఎలా ఉన్నాయి?

శామ్సంగ్ గెలాక్సీ ఎం 35 5జి స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎం 34 మాదిరిగా కంప్లీట్ ప్యాకేజీగా వస్తుంది. ఈ ఫోన్ లో గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ గ్లాస్ ప్రొటెక్షన్ కలిగిన సూపర్ AMOLED డిస్ప్లే వుంది. ఈ డిస్ప్లే 1000 నిట్స్ బ్రైట్నెస్, FHD+ రిజల్యూషన్ మరియు ఇన్ఫినిటీ 0 సెల్ఫీ కెమెరా ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను శామ్సంగ్ యొక్క సొంత లేటెస్ట్ చిప్ సెట్ Exynos 1380 తో లాంచ్ చేస్తోంది. ఈ చిప్ సెట్ AI Engine with 4.9TOPS NPU మరియు Mali- G68 MP5 GPU తో వస్తుంది.

Samsung Galaxy M35 5G
Samsung Galaxy M35 5G

ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఈ సెటప్ లో OIS సపోర్ట్ కలిగిన 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 2MP మ్యాక్రో కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ లో ముందు 13MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. గెలాక్సీ ఎం 35 ఫోన్ లో 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు 25W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ 4 జనరేషన్స్ OS అప్గ్రేడ్ లను అందిస్తుందని కూడా కంపెనీ తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo