digit zero1 awards

Samsung సూపర్ కెమెరా ఫోన్ ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో రూ. 12,999 ధరకే లభిస్తోంది.!

Samsung సూపర్ కెమెరా ఫోన్ ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో రూ. 12,999 ధరకే లభిస్తోంది.!
HIGHLIGHTS

కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్

చవక ధరకే Samsung సూపర్ కెమెరా ఫోన్ Galaxy M34 5G లభిస్తోంది

ఇతర ఆఫర్లు కూడా ఈ ఫోన్ పై లభిస్తున్నాయి

కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఎన్నడూ లేనంత చవక ధరకే Samsung సూపర్ కెమెరా ఫోన్ Galaxy M34 5G లభిస్తోంది. ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్లో రూ. 16,999 రూపాయల ప్రారంభ ధరలో విడుదలైన ఈ ఫోన్, ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 12,999 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఇది మాత్రమే కాదు ఇతర ఆఫర్ లను కూడా ఈ ఫోన్ పై లభిస్తున్నాయి.

Samsung Galaxy M34 5G: ఆఫర్ ధర

శామ్సంగ్ గెలాక్సీ ఎం 34 5జి స్మార్ట్ ఫోన్ 2023 జూలై నెలలో ఇండియాలో రూ. 16,999 రూపాయల ధరతో అడుగుపెట్టింది. అయితే, ఈ ఫోన్ ఇప్పుడు రూ. 12,999 రూపాయల ప్రారంభ ధరకు లభిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ పైన గొప్ప ఎక్స్ చేంజ్ ఆఫర్ లను కూడా అమెజాన్ అందిస్తోంది. ఆఫర్ ధరతో ఈ ఫోన్ ను అమెజాన్ నుండి నేరుగా కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Also Read: WhatsApp కొత్త అప్డేట్ తో ఇన్ యాప్ డయలర్ ఫీచర్ అందిస్తోంది.!

Samsung Galaxy M34 5G: ఫీచర్లు

శామ్సంగ్ గెలాక్సీ ఎం 34 5జి స్మార్ట్ ఫోన్ స్లీక్ మరియు స్టైలిష్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ లో మీడియం సైజు 6.5 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే గొరిల్లా గ్లాస్ రక్షణతో ఉంటుంది. ఈ డిస్ప్లే FHD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ శామ్సంగ్ సొంత Exynos 1280 5జి ప్రోసెసర్ మరియు 6GB ర్యామ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా వుంది.

Samsung Galaxy M34 5G
Samsung Galaxy M34 5G

ఈ ఫోన్ లో వెనుక ఈ ప్రైస్ సెగ్మెంట్ లో గొప్ప కెమెరా సిస్టం ఉందనే చెప్పాలి. ఎందుకంటే, ఈ ఫోన్ లో వెనుక OIS సపోర్ట్ కలిగిన 50MP మెయిన్, 8MP వైడ్ మరియు 2MP మ్యాక్రో కెమెరా కలిగిన ట్రిపుల్ కెమెరా వుంది. ఈ కెమెరాతో బ్లర్ ఫ్రీ మరియు సూపర్ స్లోమోషన్ వీడియోలను షూట్ చేసే అవకాశం వుంది. ఈ ఫోన్ లో ముందు 13MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ 6000mAh బిగ్ బ్యాటరీని ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ లో 4OS అప్గ్రేడ్ లను మరియు 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్ లను అందుకుంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo