శామ్సంగ్ గెలాక్సీ M30 ఒక ట్రిపుల్ కెమేరాతో రూ.14,990 ధరతో విడుదలైంది
ఈ ఫోన్ ఒక ఎక్సినోస్ 7904 ఆక్టా కోర్ ప్రొసెసరుతో నడుస్తుంది.
శామ్సంగ్ తన గెలాక్సీ M సిరీస్ నుండి మరొక స్మార్ట్ ఫోన్ను మిడ్ రేంజ్ సెగ్మెంట్ ని టార్గెట్ చేసుకొని విడుదల చేసింది. ముందుగా, ఈ M సిరీస్ నుండి గెలాక్సీ M మరియు M20 లను విడుదల చేసి మంచు అమ్మకాలను సాధించింది. ఫోన్లను, డ్యూయల్ వేనుక డ్యూయల్ కెమేరా సెటప్పుతో తీసుకురాగా, ఈ శామ్సంగ్ గెలాక్సీ M30 ని మాత్రం ట్రిపుల్ రియర్ కెమేరా సేతప్పుతో తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోనుతో విడుదల సందర్భంగా గొప్ప ఆఫర్లను కూడా ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ మొదట సేల్, మార్చి 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి Amazon.in నుండి మొదలవుతుంది.
శామ్సంగ్ గెలాక్సీ M30 ధర
శామ్సంగ్ గెలాక్సీ M30 – 4GB + 64GB – Rs.14,990
శామ్సంగ్ గెలాక్సీ M30 – 6GB + 128GB – Rs.17,990
శామ్సంగ్ గెలాక్సీ M30 ప్రత్యేకతలు
శామ్సంగ్ గెలాక్సీ M30 స్మార్ట్ ఫోన్ 2340 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.4 అంగుళాల సూపర్ AMOLED ఇన్ఫినిటీ – U డిస్ప్లేతో అందించబడుతుంది. అలాగే, ఇది ఒక ఎక్సినోస్ 7904 ఆక్టా కోర్ ప్రొసెసరుతో నడుస్తుంది. ఈ ప్రొసెసరు ఒక ట్రిపుల్ రియర్ కెమేరాకు అనుకూలిస్తుంది. ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 8.0.1 పైన ఆధారితంగా శామ్సంగ్ యూజర్ ఎక్స్పీరియన్స్ పైన నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక భారీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 4GB ర్యామ్ జతగా 64GB వేరియంట్ మరియు మరొక 6GB ర్యామ్ జతగా 128GB వేరియంట్తో వస్తుంది. ఒక SD కార్డు ద్వారా 512GB స్టోరేజిని పెంచుకునే సామర్ధ్యంతో వస్తుంది.
ఇక కెమెరావిభగానికి వస్తే, ఇది వెనుక భాగంలో 13MP +5MP+5MP ట్రిపుల్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇందులో 13MP ప్రధాన కెమరా మరియు 5MP అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్లకోసం మరియు మరొక 5MP డెప్త్ ని పసిగట్టటానికి ఉపయోగపడుతుంది. ఇక ముందుభాగంలో సెల్ఫీల కోసం 16MP కెమెరాని అందించారు. సెల్ఫీలను క్లిక్ చేయడంతో పాటుగా ఇది పేస్ రికగ్నైజేషన్ కోసం కూడా ఉపయోగపడుతుంది. ఇందులో అందించిన స్టిక్కర్లతో మంచి ఫన్నీ ఫోటోలను సెల్ఫీలను తీసొకొవచ్చు మరియు కంటిన్యుయస్ షాట్స్ ఎంపికతో నిరంతరంగా ఫోటోలను క్లిక్ చెయ్యవచు.