Samsung Galaxy M15 5G Prime Edition స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ ను పవర్ ఫుల్ ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో బిగ్ బ్యాటరీ, బిగ్ స్క్రీన్ మరియు ఫాస్ట్ ప్రోసెసర్ ను కూడా అందించింది. శామ్సంగ్ సరికొత్తగా లాంచ్ చేసిన ఈ బడ్జెట్ పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా.
శామ్సంగ్ ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను అన్ని ఆఫర్స్ తో కలిపి కేవలం రూ. 10,999 రూపాయల ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఇది 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో ఉంటుంది. ఈ ఫోన్ రెండవ వేరియంట్ 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో రూ. 11,999 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ యొక్క హై ఎండ్ వేరియంట్ 8GB మరియు 128GB తో రూ. 13,499 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది.
ఈ ఫోన్ తో రూ. 1,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ను అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ బ్లూ టోపాజ్, సెలెస్టియల్ బ్లూ మరియు స్టోన్ గ్రే మూడు కలర్ లలో లభిస్తుంది, ఈ ఫోన్ అమెజాన్, Samsung.com మరియు సెలెక్టెడ్ రిటైల్ స్టోర్ లలో లభిస్తుంది.
Also Read: Cyber Frauds పై ఉక్కుపాదం మోపిన ప్రభుత్వం: 800 పైగా ఫేక్ యాప్స్ బ్లాక్.!
ఈ శామ్సంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ సూపర్ AMOLED స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్ మరియు విజన్ బూస్టర్ టెక్నాలజీతో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ చిప్ సెట్ Dimensity 6100+ తో వచ్చింది. ఈ ప్రోసెసర్ కి జతగా 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో వెనుక 50MP మెయిన్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా వుంది. ఇందులో, ఒక అల్ట్రా వైడ్ కెమెరా కూడా వుంది నోయిస్ మరియు బ్లర్ ఫ్రీ వీడియో ల కోసం వీడియో డిజిటల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (VDIS) కూడా వుంది. ఈ ఫోన్ లో ముందు 13MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో 6000 mAh బిగ్ బ్యాటరీ ఉంది మరియు ఇది ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది.