Samsung Galaxy M15 5G Prime Edition ను చవక ధరలో పవర్ ఫుల్  ఫీచర్స్ తో లాంచ్ చేసింది.!

Samsung Galaxy M15 5G Prime Edition ను చవక ధరలో పవర్ ఫుల్  ఫీచర్స్ తో లాంచ్ చేసింది.!
HIGHLIGHTS

Samsung Galaxy M15 5G Prime Edition ను ఈరోజు మార్కెట్లో విడుదల చేసింది.

ఈ ఫోన్ ను పవర్ ఫుల్ ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది

ఈ ఫోన్ లో బిగ్ బ్యాటరీ, బిగ్ స్క్రీన్ మరియు ఫాస్ట్ ప్రోసెసర్ ను కూడా అందించింది

Samsung Galaxy M15 5G Prime Edition స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ ను పవర్ ఫుల్ ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో బిగ్ బ్యాటరీ, బిగ్ స్క్రీన్ మరియు ఫాస్ట్ ప్రోసెసర్ ను కూడా అందించింది. శామ్సంగ్ సరికొత్తగా లాంచ్ చేసిన ఈ బడ్జెట్ పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా. 

Samsung Galaxy M15 5G Prime Edition : ప్రైస్

శామ్సంగ్ ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను అన్ని ఆఫర్స్ తో కలిపి కేవలం రూ. 10,999 రూపాయల ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఇది 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో ఉంటుంది. ఈ ఫోన్ రెండవ వేరియంట్ 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో రూ. 11,999 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ యొక్క హై ఎండ్ వేరియంట్ 8GB మరియు 128GB తో రూ. 13,499 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. 

ఈ ఫోన్ తో రూ. 1,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ను అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ బ్లూ టోపాజ్, సెలెస్టియల్ బ్లూ మరియు స్టోన్ గ్రే మూడు కలర్ లలో లభిస్తుంది, ఈ ఫోన్ అమెజాన్, Samsung.com మరియు సెలెక్టెడ్ రిటైల్ స్టోర్ లలో లభిస్తుంది.

Also Read: Cyber Frauds పై ఉక్కుపాదం మోపిన ప్రభుత్వం: 800 పైగా ఫేక్ యాప్స్ బ్లాక్.!

Samsung Galaxy M15 5G Prime Edition : ఫీచర్స్

ఈ శామ్సంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ సూపర్ AMOLED స్క్రీన్ తో  వస్తుంది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్ మరియు విజన్ బూస్టర్ టెక్నాలజీతో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ చిప్ సెట్ Dimensity 6100+ తో వచ్చింది. ఈ ప్రోసెసర్ కి జతగా 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి ఉంటుంది.

Samsung Galaxy M15 5G Prime Edition

ఈ ఫోన్ లో వెనుక 50MP మెయిన్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా వుంది. ఇందులో, ఒక అల్ట్రా వైడ్ కెమెరా కూడా వుంది నోయిస్ మరియు బ్లర్ ఫ్రీ వీడియో ల కోసం వీడియో డిజిటల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (VDIS) కూడా వుంది. ఈ ఫోన్ లో ముందు 13MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో 6000 mAh బిగ్ బ్యాటరీ  ఉంది మరియు ఇది ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది.   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo