సాంసంగ్ గెలాక్సీ M15 5G మా ఫోన్ ఇండియాలో విడుదల చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. సాంసంగ్ ఫోన్ ను ఏప్రిల్ 8వ తారీఖున ఇండియాలో విడుదల చేయబోతోంది. అయితే, ఆశ్చర్యకరంగా ఈ ఫోన్ లాంఛ్ కంటే ముందుగానే ఈ ఫోన్ యొక్క రేటును రివీల్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ Pre-book క్యాంపైన్ ను కూడా కంపెనీ మొదలు పెట్టింది.
సాంసంగ్ గెలాక్సీ M15 5G స్మార్ట్ ఫోన్ ను Rs. XX,999 ధరలో లాంఛ్ చేయనున్నట్లు సాంసంగ్ టీజింగ్ మొదలు పెట్టింది. అంతేకాదు, ఈ ఫోన్ ను కేవలం రూ. 999 రూపాయలు చెలించి ప్రీ బుక్ కూడా చేసుకునే వీలు కల్పించింది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియాయ్ అందించిన ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా ఈ ఫోన్ ను ముందుగా బుక్ చేసుకోవచ్చు.
ఈ టీజింగ్ అమౌంట్ రివీల్ తరువాత ఈ ఫోన్ యొక్క రేటును అంచనా వేసి చెబుతున్నారు. సాంసంగ్ గెలాక్సీ M15 5G స్మార్ట్ ఫోన్ ను రూ. 10,999 రూపాయల ప్రారంభ ధరతో లాంఛ్ చేయవచ్చని సూచిస్తున్నారు. అయితే, ఇది ఎక్స్ పెక్టడ్ ధర మాత్రమే అని గుర్తుంచుకోండి.
సాంసంగ్ గెలాక్సీ M15 5G యొక్క కీలకమైన స్పెక్స్ ను కూడా కంపెనీ ముందే అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ MediaTek లేటెస్ట్ బడ్జెట్ ఫాస్ట్ ప్రోసెసర్ Dimensity 6100+ తో వస్తోంది. దీనికి జతగా 4GB / 6GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ లు ఉంటాయి. ఈ ఫోన్ లో అతి భారీ 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు 25W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 6.5 ఇంచ్ Super AMOLED ని 90 Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD+ రిజల్యూషన్ ను కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో వెనుక 50MP మెయిన్ + 5MP అల్ట్రా వైడ్ కెమేరా + 2MP మ్యాక్రో లతో ట్రిపుల్ రియర్ కెమేరా మరియు ముందు 13MP సెల్ఫీ కెమేరాని కలిగి వుంది. ఈ ఫోన్ కెమేరాతో Full HD (1920 x 1080) 30fps వద్ద వీడియోలను రికార్డ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లేటెస్ట్ Android 14 OS పైన పని చేస్తుంది మరియు 4 Android OS అప్డేట్స్ మరియు 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్ లను అందిస్తుందని తెలిపింది.