Samsung Galaxy M15 5G ఇండియా లాంఛ్ డేట్ ను అనౌన్స్ చేసింది. సాంసంగ్ బడ్జెట్ సిరీస్ అయిన M సిరీస్ నుండి తీసుకు వస్తున్న ఈ ఫోన్ ఏప్రిల్ 8న ఇండియన్ మార్కెట్ అవుతుంది. లాంఛ్ డేట్ ను కన్ఫర్మ్ చేసిన కంపెనీ ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్లను కూడా అనౌన్స్ చేసింది. ఈ ఫీచర్స్ ద్వారా ఈ ఫోన్ బడ్జెట్ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తునట్లు అర్ధమవుతోంది.
సాంసంగ్ గెలాక్సీ ఎం15 5జి స్మార్ట్ ఫోన్ ను 4 ఏప్రిల్ 2024 మధ్యాహ్నం 12 గంటలకి ఇండియాలో విడుదల చేస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను అమేజాన్ స్పెషల్ గా తీసుకు వస్తోంది. అంటే, ఈ ఫోన్ సేల్ పార్ట్నర్ గా అమెజాన్ వ్యవహరిస్తుంది. అందుకే, అమేజాన్ ఈ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్స్ తో టీజింగ్ పేజ్ ను అందించింది.
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ బిగ్ డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఇది FHD+ రిజల్యూషన్ కలిగిన AMOLED డిస్ప్లే మరియు 90 Hz రిఫ్రెష్ రేట్ ని కలిగి 800 నిట్స్ వరకూ పీక్ బ్రైట్నెస్ ని కూడా అందిస్తుంది.
సాంసంగ్ గెలాక్సీ ఎం15 5జి ఫోన్ మీడియాటెక్ Dimensity 6100+ ఆక్టా కోర్ 5G ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఇది బడ్జెట్ బెస్ట్ ప్రోసెసర్ గా చెప్పబడుతుంది మరియు ఈ బడ్జెట్ లో తగిన పెర్ఫార్మెన్స్ ను అందిస్తుంది.
Also Read: డిస్కౌంట్ ఆఫర్ తో చవక ధరకే లభిస్తున్న 5.1 Soundbar డీల్స్ ఇవిగో.!
సాంసంగ్ గెలాక్సీ ఎం15 5జి స్మార్ట్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమేరా వుంది. ఈ కెమేరా సెటప్ లో 50MP మెయిన్ సెన్సార్ + 5MP అల్ట్రా వైడ్ + 2MP సెన్సార్ లు ఉన్నాయి మరియు ముందు 13MP సెల్ఫీ కెమేరా వుంది.
సాంసంగ్ గెలాక్సీ ఎం15 5జి ఫోన్ ను భారీ 6000 mAh బ్యాటరీ ఉన్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ యొక్క ఛార్జ్ టెక్ ను మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించ లేదు.
ఈ ఫోన్ ను లేటెస్ట్ ఆండ్రాయిడ్ OS వెర్షన్ టి తీసుకు వస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ మరియు 4 OS అప్డేట్స్ ను అందుకుంటుందని కూడా సాంసంగ్ టీజింగ్ ద్వారా వెల్లడించింది.