గత వారం, శామ్సంగ్ ఏ వార్తలు లేకుండా తన శామ్సంగ్ గెలాక్సీ J7 Prime 2 స్మార్ట్ఫోన్ ని ప్రారంభించింది. ఇప్పుడు చివరకు ఈ డివైస్ భారతదేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ఫోన్ భారతదేశం లో అన్ని ఆఫ్లైన్ స్టోర్స్ నుండి కొనుగోలు చేయవచ్చు, త్వరలోనే శామ్సంగ్ ఇండియా వెబ్సైట్ నుంచి సేల్ కి అందుబాటులో ఉంటుంది.
ఈ స్మార్ట్ఫోన్ ముఖ్య ఫీచర్స్ కొన్ని చూస్తే డివైస్ ఆక్టో కోర్ ఎక్సినోస్ 7 సిరీస్ ప్రోసెసర్ తో లభ్యం . ఒక 13-మెగాపిక్సెల్ ముందు కెమెరా మరియు స్మార్ట్ఫోన్ ముందు ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలదు . బ్లాక్ మరియు గోల్డ్ రెండు వేర్వేరు కలర్ ఆప్షన్స్ కలవు .
స్పెక్స్ మరియు ఫీచర్లు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే, స్మార్ట్ఫోన్లో మీరు 5.5-అంగుళాల FHD 1080×1920 పిక్సెల్ రిసల్యూషన్ డిస్ప్లేని పొందుతారు . 3GB RAM అండ్ మైక్రోఎస్డీ కార్డు సహాయంతో 256GB వరకు పెంచగల 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ ను స్మార్ట్ఫోన్ కలిగి ఉంది.
13-మెగాపిక్సెల్ రేర్ కెమెరా మరియు 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఫోన్ లో ఫొటోగ్రఫీకి అందుబాటులో ఉన్నాయి. కనెక్టివిటీ ఆప్షన్స్ , మీరు ఫోన్లో Wi-Fi 802.11b / g / n, GPS, బ్లూటూత్ 4.1, 3G, 4G సపోర్ట్ పొందుతారు. 3300mAh బ్యాటరీ కలదు .