Samsung Galaxy J5 (2017) లాంచ్ కి ముందే సేల్స్

Samsung Galaxy J5 (2017)  లాంచ్  కి ముందే  సేల్స్
HIGHLIGHTS

Samsung Galaxy J5 (2017) యొక్క ధర Rs. 20,000 కి దగ్గరగా ఉంటుంది .

Samsung Galaxy J5 (2017)  ను ఇప్పుడు శాంసంగ్  కంపెనీ  అధికారికంగా  లాంచ్  చేసింది ,  కానీ లాంచ్ అవ్వటానికి' ముందుగానే'ఈ స్మార్ట్ ఫోన్ కొన్ని  ఆన్లైన్  షాపింగ్  వెబ్సైట్లలో  సేల్స్ జరుపుకుంటుంది .   ఈ స్మార్ట్ ఫోన్ ని   అమెజాన్  ఫ్రాన్స్  మరియు  జర్మనీ  ఆన్లైన్  షాపింగ్ వెబ్సైట్  లలో   ప్రీ  ఆర్డర్  కోసం లిస్ట్ చేయబడింది .  దీని ఆన్లైన్  లిస్టింగ్ అనుసరించి దీని స్పెక్స్  వివరిస్తున్నాము  పదండి  ఓ లుక్కేయండి..!!!

ఈ స్మార్ట్ ఫోన్  యొక్క డిసైన్  ముందు మోడల్  లానే ఉంటుంది , యాంటెన్నా బాండ్స్ కొద్దిగా భిన్నంగా వున్నప్పటికి. Samsung Galaxy J5 (2017) లో  శాంసంగ్  గాలక్సీ  J సిరీస్  వంటి   డిసైన్  ఇవ్వబడింది . ఈ ఫోన్ లో హోమ్  బటన్  పై  ఫింగర్  ప్రింట్  సెన్సార్ కలదు . 

ఈ ఫోన్ లో  5.2- ఇంచెస్ HD AMOLED  డిస్ప్లే  తో పాటుగా  2.5D  కర్వ్డ్ గ్లాస్ ప్రొటెక్షన్  కలదు . ఈ ఫోన్ ఆండ్రాయిడ్  నౌగాట్  ఆపరేటింగ్  సిస్టం పై  పనిచేస్తుంది .దీనిలో ఆక్టా  కోర్  Exynos  చిప్సెట్  కూడా ఇవ్వబడింది . దీనిలో  16GB  ఇంటర్నల్  స్టోరేజ్  ఇవ్వబడింది ,  స్టోరేజ్  ని  256GB  వరకు ఎక్స్ పాండ్  చేయవచ్చు . దీనిలో 2GB  RAM  మరియు  3000mAh  బ్యాటరీ  ఇవ్వబడింది. 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo