Samsung Galaxy J3 Pro ఈరోజు నుంచి ఫ్లిప్కార్ట్ లో అందుబాటు

Updated on 29-May-2017
HIGHLIGHTS

Samsung Galaxy J3 Pro ఫ్లిప్కార్ట్ లో Rs. 7,990 ధరలో అందుబాటు

Samsung Galaxy J3 Pro ని కంపెనీ  గత  వారం లో భారత్ లో లాంచ్ చేసింది . లాంచ్  చేసిన టైం  లో  ఇది కేవలం   PAYTM  మాల్ మరియు  PAYTM   ద్వారా దీని సేల్స్  జరిగాయి.   ప్రస్తుతం కంపెనీ  ఈ స్మార్ట్ ఫోన్ ని   మరింతమంది  యూజర్స్  కి చేరవేయాలనే  ఉద్దేశ్యంతో   ఆన్లైన్ షాపింగ్  వెబ్సైట్  ఫ్లిప్కార్ట్  తో పార్టనర్  షిప్  పెట్టుకుంది. ఈ రోజు  నుంచి ఈ స్మార్ట్ ఫోన్   ఫ్లిప్కార్ట్  లో లభ్యమవుతుంది. . ఫ్లిప్కార్ట్  లో దీని యొక్క  ధర  Rs 7,990  గా వుంది .
Samsung Galaxy J3 Pro గోల్డ్  బ్లాక్  మరియు వైట్  కలర్స్ లో అందుబాటులో వుంది. . ఈ ఫోన్ ఇంతకుముందు చైనా లో ప్రవేశపెట్టారు .  చైనా లో దీని ధర 990  వన్ అంటే సుమారు  Rs 9,332  ఈ డివైస్  లో 5.0 ఇంచెస్  HD   డిస్ప్లే  కలదు  

Samsung Galaxy J3 Pro  లో  1.5GHz  క్వాడ్  కోర్ ప్రోసెసర్  కలదు. ఈ స్మార్ట్ ఫోన్ లో  2GB RAM  అండ్  16GB ఇంటర్నల్  స్టోరేజ్  ని 128GB  వరకు ఎక్స్ పాండ్  చేయవచ్చు.ఈ ఫోన్  ఆండ్రాయిడ్  5.1  లాలీపాప్  ఆపరేటింగ్  సిస్టం  పై  పనిచేస్తుంది. 

ఈ డివైస్  లో  2600mAh  బాటరీ ఇచ్చారు  మరియు  8  ఎంపీ  రేర్  కెమెరా  మరియు 5 ఎంపీ  ఫ్రంట్ కెమెరా  ఇచ్చారు . 

Connect On :