సామ్సంగ్ గేలక్సీ J సిరిస్ ఫోన్లన్నీ బాగా సక్సేస్ ఫుల్ మోడల్స్. దానికి ప్రధాన కారణం ఇది బడ్జెట్ రేంజ్ లో రిలీజ్ అయ్యే సిరిస్. ప్రతీ ఇయర్ J సిరిస్ లో ఫోన్స్ ఉంటాయి.
ఇప్పుడు సామ్సంగ్ గేలక్సీ J3(2017) మోడల్ గతంలో Geekbench సైట్ లో కనిపించింది. ఇపుడు లేటెస్ట్ గా ఈ స్మార్ట్ ఫోన్ Evan Blass చే లీక్ చేయబడింది.
అయితే ఫోన్ డిజైన్ లో కొత్త విషయాలు ఏమి లేవు కాని కొంచెం ఎక్కువ రౌండ్ edges తో వస్తున్నట్లు తెలుస్తుంది. ఫ్రంట్ కెమెరా ప్లేస్ మెంట్ కూడా మార్పుతో వస్తుంది.
ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 430 ప్రొసెసర్, 2GB రామ్, ఆండ్రాయిడ్ 6.0 OS based TouchWiz యూజర్ ఇంటర్ఫేస్ ఉండనున్నట్లు తెలుస్తుంది.
సామ్సంగ్ J3 2017 TENAA లిస్టింగ్ లో కూడా లీక్ అయ్యింది. అక్కడ డిటేల్స్ ప్రకారం డాన్ లో సూపర్ అమోలేడ్ 5.1 720P డిస్ప్లే, 8MP/5MP కేమేరాస్ అండ్ 2600 mah బ్యాటరీ ఉండనున్నాయి.