Samsung Galaxy J2 సూపర్ AMOLED డిస్ప్లే తో భారత్ లో లాంచ్ .

Updated on 13-Oct-2017
HIGHLIGHTS

ఈ డివైస్ Samsung ఇండియా వెబ్సైట్ పై కలదు ,దీని ధర గురించి సమాచారం కనుగొనబడలేదు.

Samsung భారత్ లో తన  Galaxy J సిరీస్ లో  Galaxy J2 (2017) స్మార్ట్ఫోన్ చేర్చబడుతుంది. 
ఈ డివైస్ Samsung ఇండియా వెబ్సైట్ పై  కలదు ,దీని  ధర గురించి సమాచారం కనుగొనబడలేదు. ముంబై రిటైలర్ అయిన మహేష్ టెలికాం ఇటీవల ఈ స్మార్ట్ఫోన్ రిటైల్ ప్యాకేజింగ్ ఇమేజ్ ని  ట్వీట్ చేశారు . అతను గెలాక్సీ J2 రూ 7,390 ఉంటుందని  వెల్లడించారు.

 

 

https://twitter.com/MAHESHTELECOM/status/917641764868988933?ref_src=twsrc%5Etfw

శామ్సంగ్ గెలాక్సీ J2 స్మార్ట్ఫోన్ 1.3 గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ఎక్సి నోస్  ప్రాసెసర్ కలిగి ఉంది, మరియు ఈ డివైస్  1GB RAM మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి  ఉంది. మైక్రో SD కార్డ్ ద్వారా 128GB వరకు దీని స్టోరేజ్ ను పెంచవచ్చు. ఈ డివైస్ కి 4.7 అంగుళాల సూపర్ AMOLED qHD (540 x 960p) డిస్ప్లే ఉంది. 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా ఫ్లాష్ తో వస్తుంది, ఇది సెల్ఫీ కోసం  2MP ఫ్రంట్ కెమెరా కెమెరా ఉంది. ఈ డివైస్  2000mAh బ్యాటరీతో వస్తుంది.

ఫింగర్ ప్రింట్  సెన్సార్ శామ్సంగ్ గెలాక్సీ J2 (2017) లో లేదు. ఇది 4జి ఎనేబుల్ డివైస్ డ్యూయల్ సపోర్ట్ చేస్తుంది . కనెక్టివిటీకి, ఈ ఫోన్లో  Wi-Fi, బ్లూటూత్ v4.1, GPS, మైక్రో USB పోర్ట్ మరియు Wi-Fi డైరెక్ట్ అందిస్తుంది. అదనంగా, ఈ డివైస్  యాక్సలెరోమీటర్ మరియు ప్రాక్సిమిటీ  సెన్సార్ ని  కలిగి ఉంది. ఈ డివైస్  అబ్సల్యూట్ బ్లాక్ అండ్ మెటాలిక్ గోల్డ్ వేరియంట్స్ లో  లభిస్తుంది, అయితే కంపెనీ ఇంకా ఈ స్మార్ట్ఫోన్ అమ్మకం ప్రారంభించలేదు.

 

Connect On :