SAMSUNG Galaxy F55 5G: శామ్సంగ్ ఇండియాలో ఈరోజు కొత్త స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎఫ్ 55 5జి ని విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను సరికొత్త లెథర్ డిజైన్ మరియు 50MP సెల్ఫీ కెమెరా వంటి మరిన్ని ఫీచర్ లతో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త ఫోన్ గురించి శామ్సంగ్ గత కొంత కాలంగా టీజింగ్ చేస్తోంది మరియు ఈరోజు ఎట్టకేలకు విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర మరియు ఫీచర్లతో పాటు ఎటువంటి ఆఫర్లు ఈ ఫోన్ లాంచ్ సమయంలో శామ్సంగ్ ప్రకటించింది, అనే అన్ని వివరాల పైన ఒక లుక్కేద్దామా.
శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 55 5జి స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో విడుదల చేయబడింది. ఈ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ (8GB + 128GB) ను రూ. 26,999 ధరతో ప్రకటించింది. ఈ ఫోన్ యొక్క రెండవ మరియు హై ఎండ్ వేరియంట్ (12GB + 256GB) ను రూ. 32,999 ధరతో అనౌన్స్ చేసింది. ఈరోజు సాయంత్రం 7 గంటల నుండి ఈ ఫోన్ అర్లీ బర్డ్ సేల్ మొదలువుతుంది.
ఇక శామ్సంగ్ ఫోన్ పైన అందించిన ఆఫర్ల విషయానికి వస్తే, శామ్సంగ్ ఈ ఫోన్ పైన మంచి ఆఫర్ల
ని అందించింది. ఈ కొత్త ఫోన్ కొనుగోలు చేసే కొనుగోలుదారులు గెలాక్సీ ఫిట్ 3 ని కేవలం రూ. 1999 రూపాయలకు లేదా 45W ట్రావెల్ అడాప్టర్ ను కేవలం రూ. 499 రూపాయలకే పొందవచ్చని తెలిపింది.
శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 55 5జి స్మార్ట్ ఫోన్ ను సరికొత్త క్లాస్సి వేగాన్ లెథర్ డిజైన్ తో అందించింది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ చూడటానికి చాలా ఆకర్షణీయమైన మరియు ప్రీమియం లుక్స్ తో కనిపిస్తోంది. ఈ ఫోన్ ను లెథర్ డిజైన్ లో కూడా చాలా సన్నగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. ఈ ఫోన్ లో 6.7 ఇంచ్ Super AMOLED Plus డిస్ప్లేని అందించింది. ఈ డిస్ప్లే FHD రిజల్యూషన్ తో వస్తుంది మరియు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో ఉంటుంది.
Also Read: boAt Wave Sigma 3 స్మార్ట్ వాచ్ చవక ధరలో బిగ్ డిస్ప్లే మరియు IP67 రేటింగ్ తో వచ్చింది.!
గెలాక్సీ ఎఫ్ 55 5జి ఫోన్ ను స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 ఆక్టా కోర్ 5జి ప్రోసెసర్ కి జతగా 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో అందించింది. అంతేకాదు, ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ ద్వారా ఈ ఫోన్ స్టోరేజ్ ను 1TB వరకు ఎక్స్టెండ్ చేయవచ్చు. 4 OS అప్గ్రేడ్ లను మరియు 5 సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్ లను ఈ ఫోన్ అందుకుంటుందని కంపెనీ తెలిపింది.
ఈ ఫోన్ లో అందించిన కెమెరా సెటప్ మరియు ఫీచర్స్ ను చూస్తే, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను అందించింది. ఇందులో, 50MP మెయిన్, 8MP అల్ట్రా వైడ్ మరియు 2MP మ్యాక్రో కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరాని కూడా అందించింది. ఈ ఫోన్ కెమెరాతో 30 fps వద్ద 4K UHD వీడియో లను షూట్ చేయవచ్చని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ లో 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000mAh బిగ్ బ్యాటరీని అందించింది.