శామ్సంగ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy F55 5G Price ను లాంచ్ కంటే ముందే బయట పెట్టింది. ఈ వారంలో ఇండియన్ మార్కెట్లో విడుదల కాబోతున్న ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ యొక్క అంచనా ప్రైస్ వివరాలతో టీజింగ్ చేస్తోంది. ప్రత్యేకమైన మైక్రో సైట్ బ్యానర్ టూ ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ యొక్క టీజర్ ఇమేజ్ లో ఈ వివరాలు అందించింది.
శామ్సంగ్ గెలాక్సీ F55 5G స్మార్ట్ ఫోన్ యొక్క టీజర్ బ్యానర్ టీజర్ ఇమేజ్ లో ఈ ఫోన్ ను రూ. 2X,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసినట్లు టీజింగ్ చేస్తోంది. దీన్ని బట్టి ఈ ఫోన్ ను 30 వేల ఉప బడ్జెట్ ధరలో విడుదల చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది.
అయితే, ఈ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ రూ. 26,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో ఉండవచ్చని కొన్ని నివేదికలు మరియు లీక్ స్టర్స్ అంచనా వేసి చెబుతున్నారు. అయితే, లీక్ స్టర్స్ చెబుతున్న మాట నిజం అవుతుందో లేదో వేచి చూడాలి.
శామ్సంగ్ గెలాక్సీ F55 5G స్మార్ట్ ఫోన్ యొక్క టీజింగ్ స్పెక్స్ ను ఇప్పటికే కంపెనీ అందించింది. శామ్సంగ్ ప్రకారం, ఈ ఫోన్ ప్రీమియం క్లాస్సి వేగన్ లెథర్ డిజైన్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన Super AMOLED+ డిస్ప్లే ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
Also Read: గేమింగ్ ప్రత్యేకంగా Infinix GT20 Pro స్మార్ట్ ఫోన్ ను అనౌన్స్ చేసింది.!
ఈ ఫోన్ ను Snapdragon 7 Gen 1 ఆక్టా కోర్ 5G ప్రోసెసర్ ని 12GB వరకూ RAM సపోర్ట్ తో అందిస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నట్లు కూడా తెలిపింది. ఈ ఫోన్ వెనుక 50MP + 5MP + 2MP ట్రిపుల్ రియర్ కెమెరా మరియు ముందు 50MP సెల్ఫీ కెమెరా ఉన్నట్లు శామ్సంగ్ గొప్పగా చెబుతోంది.
శామ్సంగ్ గెలాక్సీ F55 5G ఫోన్ 4OS అప్గ్రేడ్ లను మరియు 5 సంవత్సరాల రెగ్యులర్ స్క్యూరిటీ అప్డేట్లను అందుకుంటుందని కూడా కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ లో 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉన్నట్లు కూడా టీజింగ్ ద్వారా వివరించింది. శామ్సంగ్ ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క కీలకమైన వివరాలను చాలానే అందించింది.