భారత్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయబోతున్నట్లు శామ్సంగ్ అనౌన్స్ చేసింది. గెలాక్సీ ఎఫ్ సిరీస్ నుండి ఈ ఫోన్ ను తీసుకు వస్తున్నట్లు కూడా తెలిపింది. అదే, శామ్సంగ్ అప్ కమింగ్ ఫోన్ Samsung Galaxy F55 5G మరియు ఈ ఫోన్ ను క్లాస్సి వేగాన్ లెథర్ డిజైన్ తో లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది.
శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్55 5జి స్మార్ట్ ఫోన్ ను త్వరలో లాంచ్ చేస్తున్నట్లు శామ్సంగ్ తెలిపింది. ఈ ఫోన్ కోసం Flipkart ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ క్యాంపైన్ మొదలు పెట్టింది. అంటే, ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది అని అర్ధం.
ఈ ఫోన్ ఫోన్ సంబంధించి కొన్ని విషయాలు కూడా శామ్సంగ్ టీజర్ ద్వారా వెల్లడించింది. ఈ ఫోన్ యొక్క డిజైన్, కెమెరా మరియు కలర్ ఆప్షన్ ల గురించి శామ్సంగ్ చెబుతోంది.
Also Read: 10 వేల ధర లోపల New 5G Phone కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్. !
శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 55 5జి స్మార్ట్ ఫోన్ ను క్లాస్సి వేగాన్ లెథర్ డిజైన్ తో తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ ఆప్రికాట్ క్రష్ మరియు రైజింగ్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్ లలో వస్తుందని కూడా తెలిపింది.
ఈ శామ్సంగ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 2024 లో వచ్చిన ఫోన్ లలో సెగ్మెంట్ స్లిమ్మెస్ట్ వేగాన్ లెథర్ ఫోన్ అవుతుందని కూడా తెలిపింది. గెలాక్సీ ఎఫ్ 55 5జి ఫోన్ లో వెనుక LED ఫ్లాష్ సపోర్ట్ తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా కనిపిస్తోంది.
శామ్సంగ్ ముందుగా అందించిన గెలాక్సీ ఎఫ్ సిరీస్ ఫోన్ల మాదిరిగానే ఈ ఫోన్లో కూడా సెపరేట్ కెమెరా రింగ్ తో కెమెరా సెటప్ తో కనిపిస్తోంది. మొత్తానికి ఈ ఫోన్ ను క్లాసిక్ వేగాన్ లెథర్ తో ప్రీమియం లుక్స్ తో అందిస్తున్నట్లు కనిపిస్తోంది.