Samsung Galaxy F54: రేపు ఇండియాలో విడుదలవుతోంది..!
Galaxy F54 స్మార్ట్ ఫోన్ రేపు(జూన్ 6) ఇండియాలో విడుదలవుతోంది
గొప్ప కెమేరా సెటప్ మరియు ఫీచర్ లతో లాంచ్ అవుతున్నట్లు శామ్సంగ్ గొప్పగా చెబుతోంది
కేవలం రూ. 999 చెల్లించి ఈ ఫోన్ యొక్క ప్రీ రిజర్వ్ పాస్ పొందవచ్చు
Samsung చాలా కాలంగా టీజింగ్ చేస్తున్న Galaxy F54 స్మార్ట్ ఫోన్ రేపు(జూన్ 6) ఇండియాలో విడుదలవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ గొప్ప కెమేరా సెటప్ మరియు ఫీచర్ లతో ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అవుతున్నట్లు శామ్సంగ్ గొప్పగా చెబుతోంది. ఈ ఫోన్ యొక్క టీజింగ్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ ట్రిపుల్ కెమేరా తో మరియు ఎటువంటి పరిస్థితుల్లో అయినా షేక్ లేదా బ్లర్ కానీ ఫోటోలు మరియు వీడియోలను అందించ గలదని సూచించింది. రేపు ఇండియాలో విడుదల అవుతున్న ఈ శామ్సంగ్ కొత్త ఫోన్ ఎలా ఉండబోతుందో చూద్దామా.
Samsung Galaxy F54: ముందస్తు బుకింగ్
Samsung Galaxy F54 స్మార్ట్ ఫోన్ యొక్క Pre-Reserve Pass ని కూడా కంపెనీ ప్రకటించింది. కేవలం రూ. 999 చెల్లించి ఈ ఫోన్ యొక్క ప్రీ రిజర్వ్ పాస్ పొందవచ్చు. అంతేకాదు, ఈ పాస్ అందుకున్న యూజర్లు Pre-Orders సమయంలో రూ. 2,000 తగ్గింపు అఫర్ ను అందుకుంటారని కూడా Samsung తెలిపింది. ఈ ఫోన్ Flipkart నుండి కూడా Pre-Reserve Pass కోసం అందుబాటులో వుంది.
Get ready to experience the night as it moves from dusk to dawn with #GalaxyF54 5G launching on 6th June, 3 PM. Head over to Flipkart https://t.co/10HKu0o48E to pre-reserve at just ₹ 999* and get ₹ 2000 off. *T&C apply. #Samsung pic.twitter.com/tn4HxGemHm
— Samsung India (@SamsungIndia) June 2, 2023
Samsung Galaxy F54: టీజ్డ్ & లీక్డ్ స్పెక్స్
ఇప్పటికే, Samsung Galaxy F54 యొక్క అంచనా స్పెక్స్ ను ప్రముఖ లీక్ స్టర్ ఆన్లైన్ లో వెల్లడించారు. ప్రముఖ లీక్ స్టర్ అభిషేక్ యాదవ్ ఈ ఫోన్ యొక్క అంచనా స్పెక్స్ ను తన ట్విట్టర్ అకౌంట్ నుండి వెల్లడించారు. ఇందులో, 6.7 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే, Exynos 1380 SoC, లేటెస్ట్ ఆండ్రాయిడ్ 13 OS, 108MP (OIS) మెయిన్ కెమేరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 32MP సెల్ఫీ కెమేరా మరియు 6000mAh హెవీ బ్యాటరీ వంటి కీలకమైన ఫీచర్లను ఈ ఫోన్ లో సూచించారు.
Samsung Galaxy F54 5G specifications.
6.7" FHD+ sAMOLED display
120Hz refresh rate, Gorilla glass 5
Exynos 1380
LPDDR4X UFS 2.2
Android 13
108MP OIS+8MP+2MP rear
32MP front
6000mAh battery 25 watt charging
8.4mm thick
199 gram
WiFi 6
BT5.3
USB 2.0#Samsung #GalaxyF54 pic.twitter.com/ASAGu7hocB— Abhishek Yadav (@yabhishekhd) May 30, 2023
ఇవి ఆన్లైన్ లో Samsung Galaxy F54 వస్తున్న అంచనా స్పెక్స్ వివరాలు. అయితే, రేపు ఈ ఫోన్ విడుదల అయిన తరువాత చూడాలి ఎటువంటి స్పెక్స్ మరియు ఫీచర్లతో ఈ ఫోన్ వస్తుందో.