Samsung Galaxy F54 లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన శామ్సంగ్.!

Samsung Galaxy F54 లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన శామ్సంగ్.!
HIGHLIGHTS

Samsung Galaxy F54 లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన శామ్సంగ్

ఇండియాలో జూన్ 6వ తేదీ విడుదల చేస్తునట్లు కంపెనీ అనౌన్స్ చేసింది

భారీ కెమేరా సెట్టింగ్ తో తీసుకు వస్తున్నట్లు ఈ ఫోన్ గురించి గొప్పగా చెబుతోంది

Samsung Galaxy F54 లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన శామ్సంగ్. ఈ స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో జూన్ 6వ తేదీ విడుదల చేస్తునట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన  మైక్రో సైట్  ద్వారా టీజింగ్ మొదలు పెట్టింది. అంటే, ఈ ఫోన్ ఫ్లిప్ ద్వారా అమ్మకానికి వస్తుంది కావచ్చు. ఈ ఫోన్ ఫోన్ ను భారీ కెమేరా సెట్టింగ్ తో తీసుకు వస్తున్నట్లు శామ్సంగ్ ఈ ఫోన్ గురించి శామ్సంగ్ గొప్పగా చెబుతోంది. 

శామ్సంగ్ ఫోన్ కోసం అందించిన టీజింగ్ వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ యొక్క రియర్ కెమేరా ను కంపెనీ టీజింగ్ ఇమేజ్ ద్వారా చూపించింది. ఈ టీజింగ్ ఇమేజ్ ప్రకారం, ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమేరాతో కనిపిస్తోంది మరియు కంపెనీ ఈ కెమేరా గురించి భారీగానే హైవ్ హిప్ ను ఇస్తోంది. 

ఈ ఫోన్ గురించి మరిన్ని కొత్త అప్డేట్స్ ఇక్కడ అందుకోండి.

శామ్సంగ్ ఈ ఫోన్ యొక్క లాంచ్ డేట్ ని మాత్రమే ప్రకటించినగా, లీకర్స్ మాత్రం శామ్సంగ్ గెలాక్సీ F54 యొక్క అంచనా మరియు లీక్డ్ స్పెక్స్ ను కూడా ఆన్లైన్ లో వెల్లడించారు. ప్రముఖ టిప్స్టర్ అభిషేక్ యాదవ్ ఈ అప్ కమింగ్ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెక్స్ ను తన ట్విట్టర్ అకౌంట్ నుండి వెల్లడించారు. 

ఈయన ప్రకారం, శామ్సంగ్ గెలాక్సీ F54 స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గొరిల్లా గ్లాస్ రక్షణతో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను కంపెనీ యొక్క సొంత ప్రోసెసర్ Exynos 1380 తో శామ్సంగ్ తీసుకు రావచ్చని చెబుతున్నారు. శామ్సంగ్ గెలాక్సీ F54 భారీ కెమేరా సెటప్ తో వస్తోందని కంపెనీ తెలిపింది. యాదవ్ తెలిపిన స్పెక్స్ దీనికి అనుగుణం గానే కనిపిస్తున్నాయి.

 

 

శామ్సంగ్ గెలాక్సీ F54 స్మార్ట్ ఫోన్ లో OIS సపోర్ట్ తో 108MP ట్రిపుల్ కెమేరా సెటప్ ఉన్నట్లు యాదవ్ తెలిపారు. ఇందులో, 8MP మరియు 2MP కెమేరాలు కూడా ఉన్నట్లు సూచించారు. ఈ ఫోన్ బ్యాటరీ మరియు ఛార్జ్ టెక్ గగురించి కూడా తెలిపారు. యాదవ్ ప్రకారం, ఈ ఫోన్ 6000 mAh భారీ బ్యాటరీని 25W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్ తో కలిగి ఉంటుంది. 

అయితే, ప్రస్తుతానికి ఈ ఫోన్ యొక్క స్పెక్స్ లేదా ఫీచర్ల గురించి కంపెనీ తెలియ చెయ్యలేదు. కంపెనీ ఈ ఫోన్ యొక్క టీజింగ్ లో భాగంగా మరిన్ని వివరాలను వెల్లడించే ఆవకాశం వుంది. కాబట్టి, త్వరలోనే మనకు కీలకమైన స్పెక్స్ తెలిసే అవకాశం ఉండవచ్చు. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo