ఈరోజు ఇండియాలో విడుదలైన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Samsung galaxy F54 5G యొక్క టాప్ 5 ఫీచర్ల పైన ఒక లుక్కేద్దామా. ఎందుకంటే, ఈ స్మార్ట్ ఫోన్ గొప్ప కెమెరా, హెవీ బ్యాటరీ మరియు మరిన్ని ఇతర గొప్ప ఫీచర్లను కలిగి ఉన్నట్లు కంపెనీ తెలిపింది. మరి ఈ ఫోన్ గురించి కంపెనీ తెలిపిన వివరాల్లో టాప్-5 ఫీచర్ల పైన ఒక లుక్కేద్దామా.
శామ్సంగ్ గెలాక్సీ F54 స్మార్ట్ ఫోన్ లో 6.7 ఇంచ్ సూపర్ AMOLED Plus డిస్ప్లే వుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు ఇన్ సెల్ టచ్ డిస్ప్లేతో వస్తుంది.
శామ్సంగ్ గెలాక్సీ F54 కంపెనీ యొక్క సొంత ప్రోసెసర్ Exynos 1380 ప్రోసెసర్ తో వచ్చింది మరియు దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 256 GB హెవీ స్టోరేజ్ వుంది.
ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ లో బాహారీ కెమేరా సెట్టింగ్ ని అందించింది. ఈ ఫోన్ లో వెనుక 108MP + 8MP + 2MP సెన్సార్ లు కలిగిన ట్రిపుల్ రియర్ కెమేరా వుంది. ఇందులో 108MP మెయిన్ కెమేరా OIS సపోర్ట్ తో మంచి ఫోటోలను మరియు నో షేక్ వీడియోలను అందించ గలదని కంపెనీ తెలిపింది. ఈ మెయిన్ కెమేరా తో 4K వీడియోలను (3840 x 2160) రిజల్యూషన్ తో 30fps వద్ద రికార్డ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో ముందు 32MP సెల్ఫీ కెమేరా కూడా వుంది.
ఈ స్మార్ట్ ఫోన్ శామ్సంగ్ లేటెస్ట్ యొక్క OneUI 5.1 సాఫ్ట్ వేర్ తో Android 13 OS పైన పని చేస్తుంది. ఈ ఫోన్ 4 సంవత్సరాల OS అప్డేట్ లను, 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్ లను అందుకుంటుందని శామ్సంగ్ హామీ ఇచ్చింది.
ఈ ఫోన్ లో కంపెనీ 6000 mAh హెవీ బ్యాటరీ ని 25W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది. ఈ బ్యాటరీ 23 గంటల వీడియో ప్లే బ్యాక్ అందిచగలదని కంపెనీ చెబుతోంది.