శామ్సంగ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి టీజింగ్ విడుదల చేసింది. Samsung Galaxy F34 5G స్మార్ట్ ఫోన్ ను త్వరలో ఇండియన్ మార్కెట్ లో విడుదల చేయనున్నట్లు శామ్సంగ్ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ని ఇంకా ప్రకటించినప్పటికీ, ఈ ఫోన్ కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లతో టీజింగ్ ను మాత్రం శామ్సంగ్ మొదలు పెట్టింది. ఈ అప్ కమింగ్ శామ్సంగ్ 5G మొబైల్ వివరాలు ఏమిటో తెలుసుకోండి.
Samsung Galaxy F34 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి Flipkart తన ప్లాట్ ఫామ్ పైన ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ మొదలు పెట్టింది. ఈ పేజ్ నుండి ఈ Galaxy F34 5G స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ ను కూడా వెల్లడించింది.
శామ్సంగ్ గెలాక్సీ F34 5G స్మార్ట్ ఫోన్ 16.42 cm అంటే 6.46 inch పరిమాణం కలిగిన సూపర్ AMOLED డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD+ రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే ఇన్ఫినిటీ V డిజైన్ సెల్ఫీ మరియు సన్నని అంచులను కలిగి ఉన్నట్లు టీజర్ ఇమేజెస్ చెబుతున్నాయి.
ఈ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో ఉంటుంది మరియు 1000 నిట్స్ గరిష్టమైన బ్రైట్నెస్ ని విజన్ బూస్టర్ తో కలిగి ఉంటుంది.
గెలాక్సీ F34 5G ఫోన్ వెనుక ట్రిపుల్ కెమేరా సెటప్ వుంది. ఇందులో, 50MP No Shake ప్రధాన కెమేరా ఉన్నట్లు శామ్సంగ్ తెలిపింది. అంటే, ఇది 50MP OIS కెమేరాని కలిగి వుంది. దీనితో పాటుగా గెలాక్సీ F34 5G ఫోన్ యొక్క బ్యాటరీ వివరాలను కూడా శామ్సంగ్ వెల్లడించింది.
ఈ గెలాక్సీ F34 5G స్మార్ట్ ఫోన్ లో భారీ 6000 mAh బ్యాటరీని ఉన్నట్లు టీజింగ్ ద్వారా శామ్సంగ్ గొప్పగా చెబుతోంది. ఈ బ్యాటరీ 2 రోజుల వరకూ నిలిచి ఉంటుందని కూడా చెబుతోంది. అయితే, ఇక్కడ స్టార్ మార్క్ పెట్టింది అనుకోండి . అంటే, టర్మ్స్ మరియు కండిషన్స్ వర్తిస్తాయని అర్ధం.
ఈ ఫోన్ లాంచ్ డేట్ ఇంకా ప్రకటించ లేదు కాబట్టి, ఈ ఫోన్ లాంచ్ నాటికి మరిన్ని వివరాలను కంపెనీ బయట పెడుతుంది కావచ్చు.