Samsung Galaxy F15 5G ప్రైస్ మరియు స్పెక్స్ ముందే చెప్పేసిన శామ్సంగ్.!

Updated on 29-Feb-2024
HIGHLIGHTS

Samsung Galaxy F15 5G కోసం కంపెనీ ఒక రేంజ్ లో టీజింగ్ చేస్తోంది

ఈ ఫోన్ యొక్క Expected Price తో టీజింగ్ మొదలు పెట్టింది

ఈ స్మార్ట్ ఫోన్ పైన అంచనాలను అమాంతం పెంచేసిన శామ్సంగ్

Samsung Galaxy F15 5G స్మార్ట్ ఫోన్ కోసం కంపెనీ ఒక రేంజ్ లో టీజింగ్ చేస్తోంది. టీజర్స్ ద్వారా ఈ ఫోన్ యొక్క ప్రత్యేకతలను ముందుగా అందించిన కంపెనీ ఇప్పుడు ఈ ఫోన్ యొక్క Expected Price తో టీజింగ్ మొదలు పెట్టింది. ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో రాబోతున్నట్లు ఈ స్మార్ట్ ఫోన్ పైన అంచనాలను అమాంతం పెంచేసిన శామ్సంగ్, ఇప్పుడు ఈ ఫోన్ అంచనా ధరతో మరింత స్పీడ్ పెంచింది. వాస్తవానికి, శామ్సంగ్ గెలాక్సీ F15 5G ఫోన్ అంచనా ధర ప్రకటించిన తరువాత ఈ ఫోన్ పైన హైప్ తారాస్థాయికి చేరింది.

Samsung Galaxy F15 5G: Expected Price

శామ్సంగ్ గెలాక్సీ F15 5G స్మార్ట్ ఫోన్ ను రూ. 11,XXX ప్రారంభ ధరతో లాంఛ్ చేయబొట్టునట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను March 4 వ తేదీ మధ్యాహ్నం విడుదల చేస్తుంది. అంతేకాదు, అదే రోజు సాయంత్రం 7 గంటల నుండి ఈ ఫోన్ యొక్క Early Sale కూడా మొదలవుతుందని కంపెనీ తెలిపింది.

Samsung Galaxy F15 5G Expected Price

ఈ ఫోన్ ను Flipakrt Unique గా లాంఛ్ అవుతోంది. అందుకే, ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా అన్ని అప్డేట్స్ ను అందిస్తోంది.

Also Read: Realme 12+ 5G: కేవలం రూ. 1 రూపాయితో Pre-Book చేసుకోండి.!

Samsung Galaxy F15 5G: Specs

శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్15 5జి స్మార్ట్ ఫోన్ ను Super AMOLED డిస్ప్లేతో లాంఛ్ చేస్తోంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఫోన్ ఈ డిస్ప్లే కలిగిన మొదటి 5జి ఫోన్ అవుతుంది. ఈ ఫోన్ భారీ 6000 mAh బిగ్ బ్యాటరీని కూడా కలిగి వుంది. అంతేకాదు, ఈ ఫోన్ ను 4 years ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ మరియు 5 years సెక్యూరిటీ లను ఆఫర్ చేస్తుందని శామ్సంగ్ తెలిపింది.

శామ్సంగ్ ఈ స్మార్ట్ ఫోన్ ను MediaTek Dimensity 6100+ ఆక్టా కోర్ ప్రోసెసర్ తో లాంఛ్ చేస్తోంది. ఉన్నతమైన కాలింగ్ కోసం Noise Cancellation ను కూడా ఈ ఫోన్ లో జత చేసినట్లు చెబుతోంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :