Samsung Galaxy F14: రూ. 8,999 ధరకే 50MP ట్రిపుల్ కెమెరాతో వచ్చింది.!

Updated on 03-Aug-2024
HIGHLIGHTS

శామ్సంగ్ మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది

శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 14 స్మార్ట్ ఫోన్ ను రూ. 8,999 ధరలో విడుదల చేసింది

ఈ ఫోన్ పైన No Cost EMI ఆఫర్ ను కూడా శామ్సంగ్ అందించింది

Samsung Galaxy F14: శామ్సంగ్ మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ ను మార్కెట్ లో ప్రస్తుతం నడుస్తుతున్న ట్రెండీ ఫీచర్స్ మరియు 50MP ట్రిపుల్ కెమెరాతో విడుదల చేసింది. శామ్సంగ్ గెలాక్సీ సిరీస్ నుండి ఇటీవల తీసుకు వచ్చిన గెలాక్సీ 14 5జి ఫోన్ యొక్క 4G వెర్షన్ గా ఈ ఫోన్ ను తీసుకొచ్చింది.

Samsung Galaxy F14: ధర

శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 14 స్మార్ట్ ఫోన్ ను రూ. 8,999 ధరలో విడుదల చేసింది. ఈ ఫోన్ ను కేవలం 4GB + 64GB సింగల్ వేరియంట్ లో మాత్రమే విడుదల చేసింది. ఈ ఫోన్ సెలెక్టెడ్ రిటైల్ స్టోర్ లలో మాత్రమే లభిస్తుంది. ఈ ఫోన్ పైన No Cost EMI ఆఫర్ ను కూడా శామ్సంగ్ అందించింది. శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 14 స్మార్ట్ ఫోన్ మూన్ లైట్ సిల్వర్ మరియు పెప్పర్మింట్ గ్రీన్ రెండు కలర్ లలో లభిస్తుంది.

Samsung Galaxy F14: ఫీచర్స్

శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 14 FHD+ రిజల్యూషన్ కలిగిన 6.7 ఇంచ్ స్క్రీన్ తో అందించింది. ఈ స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో కూడా ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కామ్ యొక్క బడ్జెట్ ప్రోసెసర్ Snapdragon 680 తో పనిచేస్తుంది. ఈ ప్రోసెసర్ కి జతగా 4GB ర్యామ్+ 4GB ర్యామ్ ఫీచర్ తో టోటల్ 8GB ర్యామ్ ఫీచర్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి ఉంటుంది.

Also Read: 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో కొత్త Note 40X 5G ఫోన్ లాంచ్ చేస్తున్న ఇన్ఫినిక్స్.!

ఇక ఈ ఫోన్ కలిగివున్న కెమెరా సెటప్ వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP మెయిన్ కెమెరా + 2MP+ 2MP కెమెరాలు వున్నాయి. అలాగే ముందు 13MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ కెమెరాతో FHD వీడియోలు మరియు కెమెరా ఫిల్టర్స్ తో మంచి ఫోటోలు పొందవచ్చని శామ్సంగ్ తెలిపింది.

ఇక ఈ ఫోన్ లో వున్నా ఇతర ఫీచర్ల వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ లో 5000 mAh బ్యాటరీ వుంది. ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో చాలా వేగంగా ఛార్జ్ అవుతుందని కూడా శామ్సంగ్ తెలిపింది. ఈ ఫోన్ 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ మరియు 2 మేజర్ OS అప్గ్రేడ్ లను అందుకుంటుందని కూడా శామ్సంగ్ వెల్లడించింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :