శామ్సంగ్ తన F సిరీస్ నుండి కొత్త 5G ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్తగా తీసుకువస్తున్న ఆ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy F14 5G. ఈ స్మార్ట్ ఫోన్ ను మార్చి 24 వ తేది మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, శామ్సంగ్ యొక్క అప్ కమింగ్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్లను కూడా టీజింగ్ చెయ్యడం మొదలుపెట్టింది. ఈ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.
Samsung Galaxy F14 5G స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ ను టీజింగ్ ద్వారా కంపెనీ వెల్లడించింది. Flipkart ఈ స్మార్ట్ ఫోన్ గురించి ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ Flipkart ద్వారా సేల్ కి అంధుబాటులోకి వస్తుంది. ఇక ఈ ఫోన్ గురించి శామ్సంగ్ వెల్లడించిన స్పెక్స్ మరియు ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ 6.58 ఇంచ్ FHD+ డిస్ప్లేని కలిగి వుంటుంది. అంతేకాదు, ఈ డిస్ప్లే రక్షణ కోసం దీన్ని గొరిల్లా గ్లాస్ 5 తో ప్యాక్ చేసినట్లు టీజింగ్ చెబుతోంది.
శామ్సంగ్ గెలాక్సీ F14 5G ఫోన్ కంపెనీ యొక్క సొంత 5nm ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పనిచేస్తుంది. అదే, Exynnos 1330 5G ప్రోసెసర్ మరియు దీనికి జతగా RAM Plus ఫీచర్ ను కూడా జత చేసినట్లు టీజర్ లో తెలిపింది. ఈ ఫోన్ 13 5G బ్యాండ్ లకు సపోర్ట్ చేస్తుందని, 4 సెక్యూరిటీ అప్డేట్స్ మరియు 2 OS అప్గ్రేడ్స్ ను కూడా అందుకుంటుందని కూడా శామ్సంగ్ చెబుతోంది.
ఈ ఫోన్ ను 6,000mAh బిగ్ బ్యాటరీతో తీసుకువస్తోంది మరియు ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఉంటుంది. ఈ ఫోన్ Android 13OS ఆధారితమైన లేటెస్ట్ One UI 5.0 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుందని కూడా ఈ టీజర్ ద్వారా వెల్లడించింది.