Samsung: మరొక బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసిన శామ్సంగ్.!
శామ్సంగ్ ఇండియాలో మరొక బడ్జెట్ 5G స్మార్ట్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది
Samsung Galaxy F14 5G స్మార్ట్ ఫోన్ భారీ 6000mAh బ్యాటరీతో వచ్చింది
5nm ఆక్టా కోర్ ప్రోసెసర్ మరియు మరిన్ని ఇతర ఆకర్షణీయమైన ఫీచర్లతో విడుదల చేసింది
శామ్సంగ్, ఇండియాలో మరొక బడ్జెట్ 5G స్మార్ట్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. అదే Samsung Galaxy F14 5G స్మార్ట్ ఫోన్ మరియు ఈ స్మార్ట్ ఫోన్ ను భారీ 6000mAh బ్యాటరీ, 5nm ఆక్టా కోర్ ప్రోసెసర్ మరియు మరిన్ని ఇతర ఆకర్షణీయమైన ఫీచర్లతో విడుదల చేసింది. Samsung సరికొత్తగా తీసుకొచ్చిన ఈ 5G ఫోన్ యొక్క ధర, ఆఫర్లు మరియు స్పెక్స్ పైన లుక్కేద్దామా.
Samsung Galaxy F14 5G: ధర
శామ్సంగ్ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ (4GB+128GB) ను రూ.14,490 రూపాయల ధరతో విడుదల చేసింది. అలాగే, మరోక వేరియంట్ 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో ధర రూ.15,990. ఈ స్మార్ట్ ఫోన్ పైన లాంచ్ అఫర్ లో భాగంగా మంచి బ్యాంక్ ఆఫర్లను కూడా అందించింది. ఈ ఫోన్ ను క్రెడిట్/డెబిట్ EMI మరియు క్రెడిట్ కార్డ్ పేమెంట్ ద్వారా కొనుగోలు చేసే వారికి రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది.
Samsung Galaxy F14 5G: స్పెక్స్
Samsung Galaxy F14 5G స్మార్ట్ ఫోన్ 6.58 ఇంచ్ FHD+ డిస్ప్లేని కలిగి వుంటుంది. అంతేకాదు, ఈ డిస్ప్లే రక్షణ కోసం దీన్ని గొరిల్లా గ్లాస్ 5 తో ప్యాక్ చేసినట్లు తెలిపింది. శామ్సంగ్ గెలాక్సీ F14 5G ఫోన్ కంపెనీ యొక్క సొంత 5nm ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పనిచేస్తుంది. అదే, Exynnos 1330 5G ప్రోసెసర్ మరియు దీనికి 4GB/6GB ర్యామ్ జతగా RAM Plus ఫీచర్ కూడా వుంది.
ఈ ఫోన్ 13 5G బ్యాండ్ లకు సపోర్ట్ చేస్తుందని, 4 సెక్యూరిటీ అప్డేట్స్ మరియు 2 OS అప్గ్రేడ్స్ ను కూడా అందుకుంటుందని కూడా శామ్సంగ్ తెలిపింది. ఈ ఫోన్ ను భారీ 6,000mAh బిగ్ బ్యాటరీతో మరియు 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ Android 13OS ఆధారితమైన లేటెస్ట్ One UI 5.0 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది.