Samsung Galaxy F05: శామ్సంగ్ నుండి కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను లెథర్ ప్యాట్రన్ డిజైన్ మరియు 50MP కెమెరాతో చవక ధరలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ త్వరలోనే సేల్ కి అందుబాటులోకి కూడా వస్తుంది. శామ్సంగ్ సరికొత్తగా విడుదల చేసిన ఈ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా.
శామ్సంగ్ గెలాక్సీ F05 స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 7,999 ధరతో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 4GB + 64GB సింగల్ వేరియెంట్ లో మాత్రమే లభిస్తుంది. సెప్టెంబర్ 20వ నుంచి Flipkart మరియు samsung.com నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
శామ్సంగ్ గెలాక్సీ F05 స్మార్ట్ ఫోన్ రిజల్యూషన్ కలిగిన 6.7 ఇంచ్ HD+ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ మంచి బ్రైట్నెస్ తో మరియు స్మూత్ గా పని చేస్తుందని శామ్సంగ్ తెలిపింది. ఈ శామ్సంగ్ ఫోన్ MediaTek Helio G85 ఆక్టాకోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 4GB ఫిజికల్ మరియు 4GB ర్యామ్ ప్లస్ టెక్ తో టోటల్ 8GB ర్యామ్ సపోర్ట్ అందిస్తుంది మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా కలియుగ ఉంటుంది. ఒక ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ సహాయంతో ఈ ఫోన్ స్టోరేజ్ ను 1TB వరకు పెంచుకోవచ్చు.
ఈ శామ్సంగ్ గెలాక్సీ F05 ఫోన్ లో వెనుక 50MP మెయిన్ + 2MP డెప్త్ సెన్సార్ ను కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 8MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ ను లెథర్ ప్యాట్రన్ డిజైన్ తో అందించింది మరియు ఇది చూడటానికి ఆకర్షణీయంగా వుంది. ఈ ఫోన్ లో 5000 mAh బ్యాటరీ వుంది మరియు ఈ బ్యాటరీ 25W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది.
అవుట్ ఆఫ్ ది బాక్స్ ఈ ఫోన్ Android 14 OS పై నడుస్తుంది మరియు 2 జెనరేషన్ అప్గ్రేడ్ లను అందుకుంటుందని కూడా శామ్సంగ్ తెలిపింది.