Samsung Galaxy F05: లెథర్ ప్యాట్రన్ డిజైన్ మరియు 50MP కెమెరాతో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది.!
శామ్సంగ్ నుండి కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది
Samsung Galaxy F05 ను లెథర్ ప్యాట్రన్ డిజైన్ మరియు 50MP కెమెరాతో చవక ధరలో లాంచ్ చేసింది
ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 4GB + 64GB సింగల్ వేరియెంట్ లో మాత్రమే లభిస్తుంది
Samsung Galaxy F05: శామ్సంగ్ నుండి కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను లెథర్ ప్యాట్రన్ డిజైన్ మరియు 50MP కెమెరాతో చవక ధరలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ త్వరలోనే సేల్ కి అందుబాటులోకి కూడా వస్తుంది. శామ్సంగ్ సరికొత్తగా విడుదల చేసిన ఈ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా.
Samsung Galaxy F05: ప్రైస్
శామ్సంగ్ గెలాక్సీ F05 స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 7,999 ధరతో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 4GB + 64GB సింగల్ వేరియెంట్ లో మాత్రమే లభిస్తుంది. సెప్టెంబర్ 20వ నుంచి Flipkart మరియు samsung.com నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Samsung Galaxy F05: ఫీచర్స్
శామ్సంగ్ గెలాక్సీ F05 స్మార్ట్ ఫోన్ రిజల్యూషన్ కలిగిన 6.7 ఇంచ్ HD+ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ మంచి బ్రైట్నెస్ తో మరియు స్మూత్ గా పని చేస్తుందని శామ్సంగ్ తెలిపింది. ఈ శామ్సంగ్ ఫోన్ MediaTek Helio G85 ఆక్టాకోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 4GB ఫిజికల్ మరియు 4GB ర్యామ్ ప్లస్ టెక్ తో టోటల్ 8GB ర్యామ్ సపోర్ట్ అందిస్తుంది మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా కలియుగ ఉంటుంది. ఒక ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ సహాయంతో ఈ ఫోన్ స్టోరేజ్ ను 1TB వరకు పెంచుకోవచ్చు.
ఈ శామ్సంగ్ గెలాక్సీ F05 ఫోన్ లో వెనుక 50MP మెయిన్ + 2MP డెప్త్ సెన్సార్ ను కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 8MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ ను లెథర్ ప్యాట్రన్ డిజైన్ తో అందించింది మరియు ఇది చూడటానికి ఆకర్షణీయంగా వుంది. ఈ ఫోన్ లో 5000 mAh బ్యాటరీ వుంది మరియు ఈ బ్యాటరీ 25W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది.
అవుట్ ఆఫ్ ది బాక్స్ ఈ ఫోన్ Android 14 OS పై నడుస్తుంది మరియు 2 జెనరేషన్ అప్గ్రేడ్ లను అందుకుంటుందని కూడా శామ్సంగ్ తెలిపింది.