Samsung Galaxy F04: జనవరి 4 న లాంచ్ కానున్న ఈ ఫోన్ ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.!

Updated on 09-Jan-2023
HIGHLIGHTS

ఇండియాలో మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన శామ్సంగ్

ఈ ఫోన్ ధర, కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లను కూడా కంపెనీ వెల్లడించింది

Samsung Galaxy F04 ను జనవరి 4వతేది 12PM కు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది

ఇండియాలో మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన శామ్సంగ్. అదే Samsung Galaxy F04 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ యొక్క టీజింగ్ ద్వారా ఈ ఫోన్ ధర, కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లను కూడా కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ లాంచ్ కోసం Flipakrt ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను కూడా అందించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని వివరాలు ఇక్కడ వున్నాయి.

Samsung Galaxy F04: లాంచ్ & ధర (టీజింగ్)

శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్04 స్మార్ట్ ఫోన్ ను జనవరి 4వతేది మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. టీజింగ్ పేజ్ ద్వారా కంపెనీ ఈ ఫోన్ ధరను కూడా టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ ను రూ.7,XXX ప్రారంభ ధరతో లాంచ్ చేయనునట్లు కంపెనీ టీజింగ్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ 8,000 కంటే తక్కువ ధరలో తీసుకువస్తున్నట్లు శామ్సంగ్ చెప్పకనే చెప్పింది. 

Samsung Galaxy F04: స్పెక్స్ మరియు ఫీచర్లు (టీజర్)

ఈ స్మార్ట్ ఫోన్ ను స్టైలిష్ గ్లాసీ డిజైన్ తో తీసుకువస్తున్నట్లు కంపెనీ టీజింగ్ ద్వారా తెలిపింది. ఈ ఫోన్ జేడ్ పర్పల్ మరియు ఓపెల్ గ్రీన్ అనే రెండు కలర్ అప్షన్లలో లాంచ్ చేస్తున్నట్లు కూడా చెబుతోంది. ఈ ఫోన్ ను  మీడియాటెక్ బడ్జెట్ ప్రాసెసర్ P35 తో పనిచేస్తుంది మరియు దీనికి జతగా 8GB వరకూ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అంతేకాదు, ఇందులో అందించిన ర్యామ్ ప్లస్ తో గరిష్టంగా 8GB ర్యామ్ వరకూ సపోర్ట్ ఉంటుందని కూడా సూచించింది.

టీజర్ ప్రకారం, ఈ ఫోన్ 6.5 ఇంచ్ HD+ డిస్ప్లేని ఇన్ఫినిటీ U నోచ్ తో కలిగి వుంటుంది. ఈ ఫోన్ లో పెద్ద 5000mAh బ్యాటరీని కొద జత చేసినట్లు టీజర్ పేజ్ ద్వారా కన్ఫర్మ్ చేసింది. ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ ఈ ఫోన్ లేటెస్ట్ Android 12 OS పని చేస్తుంది మరియు రెండు మేజర్ OS అప్డేట్స్ అందుకుంటుందని కూడా టీజర్ ద్వారా వెల్లడించింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :