Samsung Galaxy C55: లెథర్ బ్యాక్ తో కొత్త ఫోన్ లాంఛ్ చేసిన సాంసంగ్.!

Updated on 23-Apr-2024
HIGHLIGHTS

Samsung Galaxy C55 త్త ఫోన్ ను విడుదల చేసింది

లెథర్ డిజైన్ మరియు బిగ్ ర్యామ్ తో పాటు భారీ స్టోరేజ్ లతో విడుదల చేసింది

ఈ కొత్త ఫోన్ తో సాంసంగ్ తన గెలాక్సీ స్మార్ట్ ఫోన్ సిరీస్ పరిధిని మరింత విస్తరించింది

Samsung Galaxy C55: సాంసంగ్ యొక్క కొత్త Galaxy C Series నుండి కొత్త ఫోన్ ను విడుదల చేసింది. అదే కొత్త సాంసంగ్ గెలాక్సీ సి55 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను చైనాలో మార్కెట్ లో విడుదల చేసింది. ఈ ఫోన్ ను క్వాల్కమ్ ప్రోసెసర్, లెథర్ డిజైన్ మరియు బిగ్ ర్యామ్ తో పాటు భారీ స్టోరేజ్ లతో విడుదల చేసింది. లేటెస్ట్ గా విడుదలైన ఈ సాంసంగ్ కొత్త ఫోన్ వివరాల పైన ఒక లుక్కేద్దామా.

Samsung Galaxy C55: ప్రత్యేకతలు

సాంసంగ్ గెలాక్సీ సి55 స్మార్ట్ ఫోన్ ను సరికొత్త లెథర్ బ్యాక్ డిజైన్ తో తీసుకు వచ్చింది. ఈ ఫోన్ ఆరంజ్ మరియు బ్లాక్ రెండు కలర్ ఆప్షన్ లలో తీసుకు వచ్చింది. ఈ కొత్త ఫోన్ తో సాంసంగ్ తన గెలాక్సీ స్మార్ట్ ఫోన్ సిరీస్ పరిధిని మరింత విస్తరించింది. ఈ సాంసంగ్ కొత్త ఫోన్ ను క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 ప్రోసెసర్ తో విడుదల చేసింది. దీనికి జతగా 12GB RAM మరియు 256GB హెవీ స్టోరేజ్ లను జత చేసింది.

Samsung Galaxy C55

ఇక ఈ ఫోన్ డిస్ప్లే విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 6.7 ఇంచ్ బిగ్ Super AMOLED డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు గరిష్టంగా 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక 50MP + 8MP + 2MP ట్రిపుల్ రియర్ కెమేరా మరియు ముందు 50MP సెల్ఫీ కెమేరా సెటప్ వుంది. ఈ కెమేరా OIS సపోర్ట్ తో ఉంటుంది మరియు గోపా ఫోటోలను అందిస్తుందని సాంసంగ్ తెలిపింది.

Also Read: OnePlus గుడ్ న్యూస్: Nord CE 3 5G పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది.!

ఇక ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీని 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. సాంసంగ్ ఈ ఫోన్ ను ఆకర్షణీయమైన వేగాన్ లెథర్ డిజైన్ తో తీసుకు వచ్చింది. అంతేకాదు, ఈ ఫోన్ లో Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కూడా కలిగి వుంది.

Samsung Galaxy C55: ప్రైస్ (చైనా)

సాంసంగ్ ఈ కొత్త ఫోన్ ను చైనాలో 1,999 Yuan (సుమారు రూ. 23,000) ప్రారంభ ధరతో విడుదల చేసింది. అయితే, ఈ ఫోన్ యొక్క ఇండియా లాంఛ్ గురించి ఎటువంటి ప్రస్తావనా తీసుకు రాలేదు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :