సౌత్ కొరియన్ మొబైల్ దిగ్గజం, సామ్సంగ్ గెలాక్సీ A8 మోడల్ ను లాంచ్ చేసింది ఇండియాలో. ఫ్లాగ్ షిప్ స్పెసిఫికేషన్లను affordable ప్రైస్ కు దించాము అని ప్రోమోట్ చేస్తుంది సామ్సంగ్.
స్పెసిఫికేషన్స్ – Exynos 5 ఆక్టో కోర్ ప్రొసెసర్, 2GB ర్యామ్, 16MP కెమేరా, 3050 mah బ్యాటరీ, 5.7 in FHD డిస్ప్లే, 5MP ఫ్రంట్ కెమేరా, 32 GB ఇంబిల్ట్ స్టోరేజ్, 128GB అదనపు స్టోరేజ్ సదుపాయం, 4G.
దీని ధర 32,500 రూ. ఉన్న A8 రిటేల్ మరియు ఆన్ లైన్ స్టోర్స్ లో సేల్ అవుతుంది. కంపెని ఫోన్ తో పాటు ఎయిర్టెల్ డబుల్ డేటా ఇంటర్నెట్ ఆఫర్స్ ను ఇస్తుంది. 4G కస్టమర్స్ కు 3 నెలలు డబుల్ డేటా, 3G కస్టమర్స్ కు 6 నెలలు డబుల్ డేటా. ధర బడ్జెట్ సెగ్మెంట్ లో లేదు కాని ఫోన్ లుక్స్ మాత్రం ప్రీమియం గా ఉన్నాయి ధరకు తగ్గట్టుగానే. బరువు 151 గ్రా తో ఫోన్ కొంచెం బరువుగా అనిపిసిస్తుంది.
అయితే సామ్సంగ్ ఫోనులు మొదట్లో చాలా హై ప్రైస్ తో లాంచ్ అవటం ఒక నెలలో తగ్గటం మామూలే. ఇప్పుడు S6(38,000రూ) వంటి హై ఎండ్ మోడల్స్ కూడా సడెన్ ప్రైస్ డ్రాప్స్ తో వస్తున్నాయి. సో కొనే ముందు వెయిట్ చేస్తే మీరు చాలా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు.