సామ్సంగ్ గేలక్సీ A8 లాంచ్

సామ్సంగ్ గేలక్సీ A8 లాంచ్
HIGHLIGHTS

2GB ర్యామ్, 16MP కెమేరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్

చైనా లో సామ్సంగ్ కొత్త మోడల్ గేలక్సీ A8 రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ప్రీ ఆర్డర్స్ కు రెడీ గా ఉన్న ఈ మోడల్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో వస్తుంది. దీని ఇండియన్ అఫిషియల్ డేట్ పై స్పష్టత లేదు ఇంకా.

సామ్సంగ్ గేలక్సీ A8 స్పెసిఫికేషన్స్ –  ప్రధానంగా ఇది 5.9mm thickness తో వస్తుంది. ఇది రెండు వెర్షన్స్ లో వస్తుంది. ఒకటి డ్యూయల్ సిమ్ మరియు అదనపు స్టోరేజ్ సపోర్ట్ లేనిది, మరొకటి సింగిల్ సిమ్ మరియు అదనపు sd కార్డ్(128GB) సపోర్ట్ తో వస్తుంది. దీనికి సైడ్స్ లో దాదాపు bezel లేనట్టు ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరో ఆకర్షణ.

5.7 in FHD సూపర్ ఎమోలేడ్ డిస్ప్లే, 64బిట్ స్నాప్ డ్రాగన్ 615 ప్రొసెసర్ ( 4 కార్టెక్స్ a53 1.5GHz కోర్స్ + 4 1.0GHz కార్టెక్స్ a53 కోర్స్ ), 16 MP ఆటో ఫోకస్ రేర్ LED ఫ్లాష్ కెమేరా మరియు 5MP ఫ్రంట్ కెమేరా, అడ్రెనో 405 GPU గ్రాఫిక్స్, 2GB ర్యామ్, 16 GB మరియు 32 GB ఇంబిల్ట్ స్టోరేజ్ వేరియంట్స్, 3050 mah బ్యాటరీ, NFC దీనిలో ఉన్నాయి.

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo