Samsung Galaxy A16 5G ఫోన్ ను 6 సంవత్సరాల OS అప్గ్రేడ్ తో లాంచ్ చేయబోతున్న శామ్సంగ్.!

Updated on 08-Oct-2024
HIGHLIGHTS

Samsung Galaxy A16 5G మార్కెట్ లో త్వరలో లాంచ్ అవుతుంది

ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ ను సైతం ఇప్పుడు బయట పెట్టింది

ఈ ఫోన్ 6 సంవత్సరాల OS అప్గ్రేడ్ గ్యారెంటీ తో వస్తుందని శామ్సంగ్ తెలిపింది

Samsung Galaxy A16 5G స్మఫ్ర్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్ లో త్వరలో లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ ను సైతం కంపెనీ బయట పెట్టింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో విడుదల అవుతుంది మరియు ఈ ఫోన్ 6 సంవత్సరాల OS అప్గ్రేడ్ గ్యారెంటీ తో వస్తుందని శామ్సంగ్ తెలిపింది.

Samsung Galaxy A16 5G: లాంచ్

శామ్సంగ్ గెలాక్సీ A16 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఇంకా బయటకు రాలేదు. అయితే, ఈ ఫోన్ ను చాలా త్వరగా ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుందని శామ్సంగ్ తెలిపింది. ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ ను సైతం ఇప్పుడు బయట పెట్టింది.

Samsung Galaxy A16 5G: ఫీచర్స్

శామ్సంగ్ గెలాక్సీ A16 5జి స్మార్ట్ ఫోన్ మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో 6 సంవత్సరాల OS అప్గ్రేడ్ కోసం గ్యారెంటీ ఇచ్చే మొదటి ఫోన్ అవుతుందని శామ్సంగ్ తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ ఆకట్టుకునే చాలా గొప్ప ఫీచర్స్ ను కలిగి ఉంటుందని కూడా శామ్సంగ్ తెలిపింది. ఈ ఫోన్ గొప్ప రిజల్యూషన్ కలిగిన Super AMOLED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ గెలాక్సీ A సిరీస్ ప్రీమియం డిజైన్ మరియు ‘Key Island’ ఫీచర్ ను కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ యొక్క మరిన్ని కీలకమైన ఫీచర్స్ ను కూడా శామ్సంగ్ వెల్లడించింది. ఈ ఫోన్ అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరాని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP54 రేటింగ్ తో వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది. గెలాక్సీ A16 5జి స్మార్ట్ ఫోన్ ను గోల్డ్, లైట్ గ్రీన్ మరియు బ్లూ బ్లాక్ అనే నాలుగు కలర్ ఆప్షన్ లలో లాంచ్ చేస్తున్నట్లు కూడా శామ్సంగ్ ప్రకటించింది. ఈ ఫోన్ లేటెస్ట్ MediaTek 5G చిప్ సెట్ మరియు సెక్యూరిటీ కోసం ‘Knox Vault’ చిప్ సెట్ ను కూడా కలిగి ఉంటుంది.

Also Read: 7 వేలకే 32 ఇంచ్ స్మార్ట్ టీవీ కావాలా.. ఈ Amazon GIF Sale డీల్స్ మిస్సవ్వకండి.!

ఈ ఫోన్ అతి త్వరలో మార్కెట్ లో లాంచ్ అవుతుందని శామ్సంగ్ కానర్ఫ్మ్ చేసింది. రానున్న రోజుల్లో ఈ ఫోన్ యొక్క మరిన్ని కీలకమైన ఫీచర్స్ కూడా వెల్లడయ్యే అవకాశం వుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :