3GB ర్యామ్ తో శామ్సంగ్ డ్యూయల్ డిస్ప్లే ఫ్లిప్ ఫోన్ లాంచ్
చైనా లో శామ్సంగ్ ఆండ్రాయిడ్ os పై రన్ అయ్యే సరికొత్త ఫ్లిప్ ఫోన్ లాంచ్ చేసింది.దీని పేరు W2016. డ్యూయల్ స్క్రీన్ దీని ప్రత్యేకత. ప్రైస్ అండ్ సేల్స్ పై స్పష్టత లేదు.
స్పెక్స్ – డ్యూయల్ సిమ్, 4G, 3.9 సూపర్ అమోలేడ్ టచ్ స్క్రీన్స్. ఒక స్క్రీన్ లోపల, మరొక స్క్రీన్ టాప్ ప్యానల్ లో బయట ఉంటుంది. T9 ఫిజికల్ కీ బోర్డ్ కూడా ఉంది.
1.5GHz ఆక్టో కోర్ ప్రొసెసర్, 3gb ర్యామ్, 64gb ఇంబిల్ట్ స్టోరేజ్, sd కార్డ్ సపోర్ట్ లేదు, 16MP led ఫ్లాష్ రేర్ కెమేరా, 5MP ఫ్రంట్ కెమేరా, WiFi, GPS.
2000 mah బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ os 204 గ్రా బరువు తో ఇది మెటల్ అండ్ గ్లాస్ బాడీ లతో తయారు అయ్యింది. ఇది ఓవర్ ఆల్ గా గేలక్సీ S6 కానీ ఫ్లిప్ మోడల్ లో అని చెప్పాలి.
గతంలో ఇండియన్ మార్కెట్ లో కంపెని గేలక్సీ గోల్డన్ మోడల్ ఫ్లిప్ ఫోన్ రిలీజ్ చేయటం జరిగింది, సో కంపెని ఈ మోడల్ కూడా ఇండియా లో సేల్ చేస్తుంది అని అంచనా.