గ్లోబల్ గా అన్ని దేశాలల్లో వరుస పేలుడులతో సామ్సంగ్ గాలక్సీ note 7 ఎలా ముగిసిపోయిందో అందరికీ తెలిసినదే. కంపెని సైతం మొట్ట మొదటి సారి అమ్మిన ఫోన్లను వెన్నకు తీసుకొని డబ్బులు ఇచ్చేసింది కొన్న వారికి. అసలు ఏమైంది ఎందుకు నోట్ 7 ఫోనులు పేలిపోయాయి అని అనుకుంటూ ఉండగా ఆ మధ్య అది బ్యాటరీ కారణం అని కొన్ని మాటలు వినిపించాయి. అంటే బ్యాటరీ జనరల్ గా చార్జింగ్ సమయంలో కొంత సైజ్ పెరుగుతుంది అనీ, దానికి సాధారణంగా కంపెనీలు కొంత స్పేస్ విడిచిపెడతారు అనీ, కాని నోట్ 7 మోడల్ లో ఈ స్పేస్ లేకుండా ఫోన్ డిజైన్ అవటం వలన వరుస పెలుడులకు గుర్రయ్యింది నోట్ 7 అనేది దాని వెనుక ఉన్న విషయం. కాని అప్ కమింగ్ సామ్సంగ్ గేలక్సీ S8 మరియు A సిరిస్ (ఎక్కువ బ్యాటరీ తో వచ్చే మోడల్స్) లో కూడా నోట్ 7 కు వాడిన అదే సామ్సంగ్ SDI బ్యాటరీలను వాడుతున్నట్లు కొరియన్ సోర్సెస్ చెబుతున్నాయి. అంత పెద్ద తప్పిదం జరిగిన తరువాత కూడా కంపెని మరలా అదే సామ్సంగ్ SDI నుండి బ్యాటరీస్ ను వాడటం మానివేయాలి కదా అనేది కొత్త వాదన గా వినిపిస్తుంది. సో నోట్ 7 పేలుడులకు బ్యాటరీ కారణం అయ్యుండదు అనేది ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న రిపోర్ట్. కంపెని మాత్రం జనవరి ఎండింగ్ లో పేలుడులపై ఒక స్పష్టత ఇస్తుంది అని అంచనా.
Samsung Galaxy Note Edge అమెజాన్ లో 45,707 లకు కొనండి