మరొక బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసిన శామ్సంగ్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..!!

Updated on 26-Aug-2022
HIGHLIGHTS

Samsung ఇండియాలో మరిక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది

అదే, Samsung Galaxy A04 ఆకర్షణీయమైన ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది

ఈ ఫోన్ పెద్ద 5000 mAh బ్యాటరీతో వస్తుంది

Samsung ఇండియాలో మరిక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. అదే, Samsung Galaxy A04 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను బిగ్ బ్యాటరీ మరియు 50MP కెమెరా వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ గత సంవత్సరం ప్రవేశపెట్టిన గెలాక్సీ A03 యొక్క నెక్స్ట్ జెనరేషన్ ఫోన్ గా మార్కెట్లో ప్రవేశించింది. మరి లేటెస్ట్ శామ్సంగ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ పార్టీ వివరాలేమిటో తెలుసుకుందామా.       

Samsung Galaxy A04: స్పెక్స్

శామ్సంగ్ గెలాక్సీ ఎ04 స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ డిస్ప్లేను కలిగివుంది. ఈ డిస్ప్లే ఇన్ఫినిటీ వి- నోచ్ తో వస్తుంది మరియు ఇందులో 5MP సెల్ఫీ కెమెరాని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ యొక్క ఏ ప్రాసెసర్ తో పనిచేస్తుందనే విషయాన్ని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ ఫోన్ లో Exynos 850 ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉందవచ్చని ఊహిస్తున్నారు. ఈ ఫోన్ 8GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ లతో వస్తుంది.

ఈ ఫోన్ 3.5mm జాక్, డ్యూయల్-బ్యాండ్ WiFi ac, Bluetooth 5.0 ఫీచర్లతో వస్తుంది. అలాగే, Android 12 ఆధారిత One UI కోర్ 4.1 సాఫ్ట్‌వేర్‌ తో నడుస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ పెద్ద 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అయితే, ఈ ఫోన్ ఎటువంటి ఛార్జింగ్ టెక్ ను తో వస్తుందో మాత్రం కంపెనీ తెలుపలేదు.

Samsung Galaxy A04: ధర

శామ్సంగ్ గెలాక్సీ ఎ04 స్మార్ట్ ఫోన్ యొక్క ధర మరియు సేల్ వివరాలను Samsung ఇంకా వెల్లడించలేదు. ఈ స్మార్ట్ ఫోన్ తెలుపు, నలుపు, ఆకుపచ్చ మరియు రాగి రంగులలో అందుబాటులో ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :