Google యొక్క Android పై ఆధారపడటం తగ్గించుకోవటానికి Huawei తన సొంత మొబైల్ OS పై పనిచేస్తుంది అని వార్తలు బాగా వినిపిస్తున్నాయి. Huawei స్వతంత్ర ఆపరేటింగ్ సిస్టమ్ కోసం దాని సొంత కిరిన్ చిప్సెట్ ను రూపోందించికుంటుంది. అంతేగాక ఈ సంవత్సరం లో రానున్నరెండు నేక్సాస్ ఫోన్లలో ఒకదానిపై Huawei పనిచేస్తుంది. రెండవ నేక్సాస్ పై LG పనిచేస్తుంది. Huawei సీఈఓ తమ ఫోన్ల పై QHD డిస్ప్లే లను వాడటం మానివేయడంతో గూగల్ డిమాండ్ తో హై రిజల్యుషన్ డిస్ప్లే ను మళ్ళీ వాడటం మొదలుపెట్టింది Huawei.
Huawei అమెరికా దేశంలో కూడా విస్తరించనుంది. వచ్చే నెల రెండవ తారీఖున న్యుయోర్క్ లో ఒక ఈవెంట్ కోసం ప్రెస్ కి ఇన్వైట్లు పంపింది Huawei. ప్రస్తుతం కంపెనీలు అన్నీ ఆండ్రాయిడ్ పై ఆధారపడకుండా ఉండటానికి తమ సొంత OS లను అభివృద్ధి చేసుకుంటున్నారు. Samsung’s Tizen OS, CyanogenMod OS మరియు OnePlusOne Oxygen OS లు ఇప్పటికే సొంత OSలను తయారు చేసుకున్నాయి. అంతేగాక ZTE కూడా తన సొంత OS ను విడుదల చేయనుంది. అయితే Huawei మాత్రం ఇప్పటి వరకూ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. మీరు ఏమనుకుంటున్నారు, నిజంగా Huawei ఆండ్రాయిడ్ ను తలదన్నేలా కొత్త OS ను తయారు చేయగలదా?