Freedom 251 ఫోన్ అసలు హాండ్ సెట్ ఎట్టకేలకు బయటకు వచ్చింది. అవును ఇంతవరకు మీరు చూసిన ఇండియన్ ఫ్లాగ్ వైట్ హాండ్ సెట్ కేవలం నమూనా డిజైన్ మాత్రమే.
రేపటి నుండి deliveries స్టార్ట్ అవుతున్నాయి. అవును లాస్ట్ టైం చెప్పిన డేట్ మరలా వాయిదా అయ్యింది. సో టోటల్ రెండు లక్షల యూనిట్స్ తయారీ అయ్యాయి.
మొదటి phase లో కేవలం 5000 హ్యాండ్ సెట్స్ మాత్రమే డెలివరీ చేస్తుంది రింగింగ్ బెల్స్(కంపెని పేరు). నాలుగు ఫీచర్ ఫోనులు మరియు రెండు కొత్త స్మార్ట్ ఫోనులు కూడా అనౌన్స్ చేసింది కంపెని.
Hit, King, Boss and Raja…. నాలుగు ఫీచర్ ఫోనుల పేరులు. మరో రెండు స్మార్ట్ ఫోనుల పేరులు Elegant మరియు Eegance.
నాలుగు ఫీచర్ ఫోన్స్ 180 days replacement గారెంటీ, రెండు స్మార్ట్ ఫోన్స్ 30 రోజుల replacement గారెంటీ తో వస్తున్నాయి. ఇది మంచి విషయమే.
కంపెని ఇంకా 9990 రూ లకు cheapest LED టీవీ ను కూడా లాంచ్ చేసింది మార్కెట్ లో. పేరు Freedom TV. ఆగస్ట్ 15 నుండి సేల్స్ స్టార్ట్. ఇది 31.5 in LED టీవీ.
3000:1 contrast ratio with 1366×768 pixel resolution తో వస్తుంది ఈ టీవీ. కంపెని చెప్పిన దాని ప్రకారం టీవీ మరియు ఫోనుల నుండి వచ్చే 95% ప్రాఫిట్ లను చారిటి కు ఇవనుంది రింగింగ్ బెల్స్.
కంపెని ప్రెసిడెంట్ ashok chadha మాట్లాడుతూ.."251 తయారు చేయటానికి మాకు 1100 – 1200 రూ అవుతుంది. సో freedom సేల్స్ లో వచ్చే losses ను ఇతర ప్రొడక్ట్స్ లో ప్రాఫిట్స్ తో కవర్ చేయనున్నాము" అని అన్నారు.
చాలా మంది criticism చేయటం జరిగింది, సో ఫోన్ reality లోకి తేవటానికి మేము చేసిన ప్రయత్నాలే వారికీ సమాధానలు అని అన్నారు అశోక్. కంపెని సీఈఓ, Mohit Goel తన ఇల్లు, షాప్ ను తాకట్టు పెట్టడం కూడా జరిగింది రింగింగ్ బెల్స్ కంపెని కొరకు.