Jio సిమ్స్ ను home delivery పద్దతిలో అందించే ప్రణాళికలు పై రిలయన్స్ పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. Telecom Talk రిపోర్ట్స్ ప్రకారం online పద్దతిలో పనిచేయనుంది ఇది.
అంటే సిమ్ తీసుకుందామని అనుకునే వారు వెబ్ సైట్ లో sign up అయ్యి సిమ్ కార్డ్ ను బుక్ చేసుకోగలరు. అయితే ఇదే పద్దతిలో గతంలో ఎయిర్టెల్ కూడా ప్రవేశ పెట్టింది.
దాని గురించి మీకు ఇంతకముందు తెలియజేయటం కూడా జరిగింది. ఎయిర్టెల్ 4G సిమ్ కు అప్ గ్రేడ్ అయితే కూడా ఇదే మాదిరిగా ఇంటికి వచ్చి 4G సిమ్ ను ఇస్తుంది ఎయిర్టెల్.
సో ఇప్పుడు రిలయన్స్ కూడా ప్రస్తుతం ఉన్న ఇబ్బందులను తొలిగించటానికి ఈ పద్దతిని అనుసరించనుంది అని అప్ డేట్. అయితే త్వరలోనే కంపెని కూడా దీనిపై అంతా సిద్దం చేసుకున్న తరువాత స్పందించనుంది అని అంచనా.