మెటాలిక్ ఫ్రేమ్ & 5 in HD డిస్ప్లే తో లూమియా 650 మోడల్..
మైక్రోసాఫ్ట్ లుమియా విండోస్ డివైజెస్ ఇప్పటివరకూ ప్లాస్టిక్ బిల్డ్ తో సేమ్ డిజైన్ లో రావటం జరిగింది. అయితే కొత్తగా లుమియా 650 మోడల్ యొక్క ఇమేజెస్ ఇంటర్నెట్ లో లీక్ అవటం జరిగింది.
ఇమేజెస్ అఫిషియల్ కాకపోయినా ఫైనల్ ప్రోడక్ట్ కు ఇవి ఇంచుమించు కరెక్ట్ పిక్స్ అని విండోస్ సెంట్రల్ వెబ్ సైట్ తెలియజేసింది. దీనిలో క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 212 ప్రొసెసర్ 1.3GHz తో వస్తుంది అని రిపోర్ట్స్..
అలాగే 5 in 720P డిస్ప్లే, 1gb ర్యామ్, 8gb ఇంబిల్ట్ స్టోరేజ్, sd కార్డ్ సపోర్ట్, అడ్రెనో 304 GPU, క్విక్ చార్జ్ 2.0 8MP రేర్ అండ్ 5MP ఫ్రంట్ కెమేరాస్.
డ్యూయల్ సిమ్, NFC, బ్లూటూత్ 4.1, WiFi కాలింగ్ తో విండోస్ 10 os తో బ్లాక్ అండ్ వైట్ matte డిజైన్స్ తో రానుంది అని రిపోర్ట్స్. పోస్ట్ అయిన ఇమేజెస్ చూస్తే చుట్టూ మెటాలిక్ ఫ్రేమింగ్ ఉన్నట్లు హింట్స్ ఇస్తుంది.
ఫెబ్రవరి 2016 లో బార్సెలోన లో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో మైక్రోసాఫ్ట్ దీనిని అనౌన్స్ చేస్తుంది అని అంచనా. ఈ ఇయర్ లో లాంచ్ అయిన 640 అండ్ 640 XL కు 2015 MWC లో అనౌన్స్ అయినవే.