రిలయన్స్ Jio గురించి మార్నింగ్ ఒక పోస్ట్ చేయటం జరిగింది. అయితే ఈ రోజే కంపెని కూడా మూడు Jio మోడల్స్ ను అఫీషియల్ సైట్ లో లిస్టు చేసింది. పైన ఇమేజ్ లో మొదటిది Lyf earth, రెండవది వాటర్ 1 మూడవది వాటర్ 2
అవి Lyf Earth 1, Lyf water 1 మరియు Water 2. అయితే వీటిలో earth 1 మోడల్ పై కంపెని గతంలోనే కొన్ని వివరాలు తెలియజేసింది.
Earth 1 ప్రైస్ – 23,990 రూ. Lyf water 1 ధర – 14,999 రూ అండ్ Lyf Water 2 ధర 14,690 రూ. ఇవి కంపెని అఫీషియల్ గా రిలయన్స్ డిజిటల్ వెబ్ సైట్ లో పెట్టిన ప్రైసేస్.
LYF Earth 1 ఫోన్
Earth 1 స్పెక్స్ – డ్యూయల్ సిమ్ 5.5 in ఫుల్ HD అమోలేడ్ డిస్ప్లే, ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 615 1.5GHz ప్రాసెసర్, 3GB ర్యామ్, 32GB స్టోరేజ్, 32 sd కార్డ్ సపోర్ట్, డ్యూయల్ రేర్ కెమెరా(13MP అండ్ 2MP), 5MP ఫ్రంట్ కెమెరా ,4G LTE, బ్లూ టూత్ 4.0, ఆండ్రాయిడ్ 5.1.1 లాలిపాప్, 3500 mah బ్యాటరీ, 162 గ్రా బరువు
Lyf Water 1 అండ్ Water 2 common స్పెక్స్ – డ్యూయల్ sim, 4G LTE, 1.5GHz ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 615 SoC, 2GB ర్యామ్, 16GB స్టోరేజ్, 32GB sd కార్డ్ సపోర్ట్, 13MP అండ్ 5MP రేర్/ఫ్రంట్ కేమేరాస్ with LED ఫ్లాష్ bothsides అండ్ 5 in LCD డిస్ప్లే
వాటర్ 1 లో FHD 5 in స్క్రీన్ ఉండగా వాటర్ 2 లో HD 5 in డిస్ప్లే ఉంది. బ్యాటరీ కూడా వాటర్ 1 లో 2600 mah ఉండగా వాటర్ 2 మోడల్ లో 2400 mah కలిగి ఉంది.
LYF వాటర్ 1 మరియు వాటర్ 2 ఫోన్స్
6.8mm సన్నని డిజైన్ తో unibody డ్యూయల్ గ్లాస్ ఫినిషింగ్ బాడీ తో వాటర్ 1 ఉంది. 7.7mm unibody డిజైన్ తో డ్యూయల్ tone సిల్వర్ matte ఫినిషింగ్ కలిగి ఉంది వాటర్ 2 మోడల్.
వాటర్ 2 లో అదనంగా రెటీనా స్కానింగ్ access ఉంది. మూడు మోడల్స్ ఆండ్రాయిడ్ 5.1.1 లాలిపాప్ సాఫ్ట్ వేర్ పై రన్ అవనున్నాయి out of the box. వాటర్ 1 అండ్ 2 స్మార్ట్ ఫోన్స్ బ్లాక్ అండ్ వైట్ రెండు కలర్స్ తో వస్తున్నాయి. వీటి రిలీజ్ డేట్స్ పై ఇన్ఫర్మేషన్ లేదు.
రిలయన్స్ jio లో ఇంటర్నెట్ ఫ్రీ డేటా ఆఫర్స్ అండ్ కాల్స్ ఆఫర్స్ కొరకు ఈ ఆర్టికల్ చదవండి.
ఆధారం: Reliance Digital