వోడాఫోన్ రూ. 1,499 వార్షిక ప్లాన్
వోడాఫోన్ భారతదేశంలో 1,499 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ను ప్రారంభించింది. ఈ ప్రణాళిక వాడుకదారులకు, 365 రోజుల చెల్లుబాటుతో, అపరిమిత కాల్స్, వొడాఫోన్ ప్లే చందా, అపరిమిత జాతీయ రోమింగ్ మరియు రోజుకు 1GB డేటాను అందిస్తుంది. ఈ డేటా పరిమితికి చేరుకున్న తర్వాత, వినియోగదారులు అదనపు ఒక MB కు 50 పైసలు చెల్లించవచ్చు. వినియోగదారులకి, రోజువారీ 100 SMS ' ల కూడా లాభం కూడా చేకూరుతుంది.అంటే మొత్తంగా, 365GB డేటా ప్రయోజనాన్ని అందుకుంటారు.
BSNL రూ. 1,312 వార్షిక ప్లాన్
రూ. 1,312 ప్రీపెయిడ్ ప్లానుతో, BSNL రోమింగుతో సహా 24 గంటల ఉచిత స్థానిక మరియు ఎస్టీడీ కాల్స్ అందిస్తోంది. అయితే, ఈ BSNL ప్లాను కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ఈ ప్లానుతో ఢిల్లీ మరియు ముంబై సర్కిళ్లకు కాల్ చేయడానికి అవకాశంలేదు మరియు పూర్తి సంవత్సరానికి కేవలం, 5GB డేటాను మాత్రమే ఇస్తుంది. ఎక్కువగా, కేవలం కాల్స్ కోసం ఒక ప్లాన్ తీసుకోవాలని కోరుకునేవారికి, ఇది కచ్చితంగా ఒక మంచి ప్లాన్. అదనంగా,పూర్తి విశ్వసనీయతతో 1000 SMS లను పూర్తి వ్యాలిడిటీ కాలానికి ఆస్వాదించగలరు. వీటి తోపాటు, పూర్తి సంవత్సరానికి గాను వినియోగదారుడు హలో ట్యూన్లను ఎంజాయ్ చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలలో మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది.
రిలయన్స్ జియో రూ. 1,699 వార్షిక ప్లాన్
రిలయన్స్ జీయో అందిస్తున్న రూ 1,699 ప్రణాళికతో, 100 స్థానిక మరియు జాతీయ ఎస్ఎంఎస్ రోజువారీతో పాటు FUP లేకుండా వినియోగదారులు అపరిమిత స్థానిక మరియు జాతీయ కాల్స్ పొందుతారు. జీయో ప్లాన్ దాని వినియోగదారులకు JioTV, JioMovies మరియు JioSaavn మ్యూజిక్ మరియు మరిన్ని ఆప్స్ కు కూడా యాక్సెస్ ఇస్తుంది . దీని డేటా విషయానికి వచ్చినప్పుడు, Jio వినియోగదారులకు, రోజుకు 1.5GB డేటా ఆఫర్ చేస్తోంది. ఈ డేటా పరిమితికి చేరిన తర్వాత, వేగం అర్ధరాత్రి వరకూ 64Kbps కి పడిపోతుంది.