Jio కోసం మీరు MN పోర్టబిలిటీ ట్రై చేశారా? అది ఎందుకు జరగలేదో చెప్పింది రిలయన్స్
రిలయన్స్ Jio. గత కొద్ది రోజులుగా ఇది జీవితంలో ఒక ఇంపార్టెంట్ భాగం అయిపొయింది gadget geeks కు. అంబానీ free ఆఫర్స్ అనౌన్స్ చేసిన దగ్గర నుండి కంపెని కు ఇతర టెలికాం నెట్ వర్క్స్ తో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు రిలయన్స్ చెబుతుంది.
రీసెంట్ గా MNP రిక్వెస్ట్ లకు కూడా ఇతర నెట్ వర్క్స్ ఇబ్బంది పెడుతున్నట్లు అంబానీ వెల్లడించారు. ఈ సందర్భంగా Jio బృందం TRAI చైర్మన్ కు లెటర్ కూడా వ్రాసారు.
ఈ నేపధ్యంలో TRAI చైర్మన్ కూడా ఎయిర్టెల్, vodafone, idea నెట్వర్క్స్ చేస్తున్న పనులు చట్ట విరుద్దమని తెలిపారు. ఇవి ఇలాగే కంటిన్యూ అయితే లైసెన్స్ లు cancel చేయనున్నట్లు వెల్లడించారు.
రిలయన్స్ లెక్కలు ప్రకారం సెప్టెంబర్ 9 నుండి 12 వరకూ జరిగిన పోర్టింగ్ రిక్వెస్ట్ లను ఇతర నెట్వర్క్స్ అందరూ తిరస్కరించారు.
గమనిక: సిమ్స్ లేవు దేశం అంతటా. దీనికి ఎవరూ ఏమి చేయలేరు. మిమ్మల్ని మీరు ఓపికగా ఉంచుకోవటం తప్ప మరొక సొల్యూషన్ లేదు. దీనిపై అదనపు సమాచారం ఏమైనా ఉంటే మీకు కచ్చితంగా తెలియజేస్తాను.