రిలయన్స్ జియో ఫోన్ 2 రెండవ ఫ్లాష్ సేల్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు : అందుబాటు ,డేటా ప్లాన్స్, స్పెక్స్ ఇంకా మరిన్ని వివరాలు

Updated on 30-Aug-2018
HIGHLIGHTS

వాట్సాప్ మరియు పేస్ బుక్ లాంటి యాప్స్ కి సపోర్ట్ చేయగల రిలయన్స్ జియో ఫోన్ 2 మరొక ఫ్లాష్ సేల్ ను ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి అందించనుంది.

రిలయన్స్ రూ . 2,999 కి అందిస్తున్న ఈ జియో ఫోన్ 2 ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మరొక ఫ్లాష్ సేల్ ద్వారా అమ్మకానికి రెడీ అవుతుంది. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు దీని jio.com మరియు myjio యాప్ ద్వారా కొనుక్కోవచ్చు. జియోఫోన్ 2 లో గుర్తించదగిన మార్పులలో ఒకటిగా QWERTY కీబోర్డుగా చెప్పవచ్చు, ఇది నాలుగు-మార్గాల నావిగేషన్ కీతో ఉంటుంది.

జియో ఫోన్ 2 డేటా ప్లాన్స్

రిలయన్స్ జీయో నుంచి మూడు పథకాలతో జియోఫోన్ 2 ని జతచేసారు. రూ . 49 ప్లాన్ వినియోగదారులకు 1జీబీ  డేటా, 50 ఉచిత ఎస్ఎంఎస్, ఉచిత అపరిమిత కాలింగ్ మరియు జీయో యాప్స్ 28 రోజులు చెల్లబాటునిస్తుంది. ఇంకా  రూ .99 ప్లాన్, 14 జీబి డేటా, ఫ్రీ కాలింగ్, 300 ఎస్ఎంఎస్, జీయో యాక్సెస్ కి 28 రోజులు అందుబాటులో ఉంటుంది. చివరగా, జియో నుండి రూ .153 ప్లాన్ ద్వారా, 42జీబీ డేటా, ఉచిత కాలింగ్, జీయో యాప్స్  కి యాక్సెస్, మరియు ఉచిత అపరిమిత ఎస్ఎంఎస్, 28 రోజులు విశ్వసనీయ చెల్లుబాటు తో  అందిస్తుంది.

జియోఫోన్ 2 స్పెషిఫికేషన్స్ మరియు ఫీచర్స్

 జియోఫోన్ 2  క్షితిజసమాంతర వీడియో వీక్షణను అందించే 2.4-అంగుళాల QVGA డిస్ప్లే మరియు డ్యూయల్ – సిమ్ మద్దతును అందిస్తుంది. అయితే ఇందులో 4జి  వోల్టి(voLTE) స్లాట్ లో జియో ని మాత్రమే వాడుకునే వీలుతో పాటు 2జి స్లాట్ తో రెండవ ఇతర ఆపరేటర్ సిమ్ ని వాడుకోవచ్చు.

ఈ డివైజ్లో 512ఎంబీ ర్యామ్ మరియు 4జీబీ  అంతర్గత స్టోరేజ్ తో వస్తుంది, ఇది మైక్రో SD కార్డుని ఉపయోగించి 128జీబీ వరకు మరింతగా విస్తరించే వీలుంది. . జియోఫోన్ మాదిరిగానే, జియోఫోన్ 2 కూడా KAI OS పై నడుస్తుంది మరియు ఇది 2,000 mAh శక్తిగల బ్యాటరీని కూడా కలిగి వుంది. ఈ ఫోన్ 1GHz డ్యూయల్-కోర్ ప్రొసెసర్ తో పనిచేస్తుంది మరియు 2ఎంపీ రియర్ కెమేరా వెనుక మరియు 0.3 ముందు కెమెరాని ఈ డివైజ్ కలిగివుంటుంది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :